తేజ పొలిటికల్ డ్రామా వర్కవుట్ అవుతుందా..?

'జయం' సినిమా తరువాత ఆ స్థాయిలో చెప్పుకోదగ్గ హిట్ సినిమా చేయలేకపోయాడు దర్శకుడు తేజ. వరుస పరాజయాలను చవిచూస్తోన్న ఈ దర్శకుడు తన పంధాను మార్చుకొని కొత్త జోనర్ లో సినిమా చేస్తున్నట్లు సమాచారం. రానా, కాజల్ జంటగా తేజ ఓ సినిమాను రూపొందించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా తేజ స్టైల్ లో ఉండే ఒక లవ్ స్టోరీ అని భావించారంతా.. కానీ అందుతున్న సమాచారం ప్రకారం ఇదొక పొలిటికల్ డ్రామా కాన్సెప్ట్ తో నడిచే సినిమా అని తెలుస్తోంది. హై ఇంటెన్స్ తో సాగే ఈ కథలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. తేజ చాలా పవర్ ఫుల్ గా ఈ స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడట. ఈ సినిమాలో కాజల్ పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉండబోతున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం కాజల్ తన బరువును కూడా తగ్గించుకోబోతోంది. అలానే ఈ సినిమాలో రానా, కాజల్ భార్య భర్తలుగా కనిపించబోతున్నారు. రానా నటించిన 'లీడర్' సినిమాను మించి ఈ సినిమా ఉండబోతుందని టాక్. వచ్చే నెల నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. మరి ఈ సినిమాతో అయినా తేజ హిట్ కొడతాడేమో చూడాలి..!







































