'సరైనోడు' కి మైనస్ జరిగిందంతా అక్కడే!

పడిపోయేదాన్ని నిలబెట్టాలంటే భారీ ప్రణాళిక కావాలి. ముందుగానే జాగ్రత్త పడకపోవడం వల్ల ఊహించని నష్టం జరిగింది. ఇదంతా సరైనోడు సినిమా గురించే. ప్రీ పబ్లిసిటీపై అల్లు అరవింద్ దృష్టిసారించక పోవడం వల్ల సరైనోడు చిత్రం సర్దార్...  తరహాలో క్రేజీ మూవీగా ప్రాచూర్యం పొందలేకపోయింది.  దాంతో ఓపనింగ్స్ పరంగా దడదడలాడించాల్సిన ఈ సినిమా దానికి విరుద్దంగా ఉంది. 

అప్పటి వరకు దర్శకుడు బోయపాటి హైలెట్ కాకుండా ప్లాన్ చేసి, చివర్లో గేట్లు ఎత్తేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. బోయపాటిని పక్కన పెట్టారనే విమర్శలు తప్పలేదు. చివర్లో అల్లు అర్జున్ కు బెంగళూరు అభిమానులపై ఉన్న ప్రేమ తెలుగు మీడియా, తెలుగు ప్రేక్షకులపై లేకపోవడం విచిత్రం. 

హీరోల కారు డోర్లు తెరిచే వాళ్ళు సినిమా ప్రచార బాధ్యతలు తీసుకుంటే వారి ఆలోచనలు దిగజారుడుగానే ఉంటాయి. రిలీజ్ కు ముందు చేసుకోవాల్సిన ప్రచారాన్ని మరిచారు. సినిమాకు క్రేజ్ రావాలంటే పక్కా ప్లానింగ్ తో ప్రచారం చేయగలిగే నేర్పు ఉండాలి. కేవలం ప్రెస్ మీట్స్ పెట్టేస్తే చాలను కుంటే ఆపని ఎవరైనా చేయగలరు. సరైనోడుకు ప్రీ పబ్లిసిటీ దారుణంగా  ఉంది. సరైన స్టిల్స్ కూడా మీడియాకు రిలీజ్ చేయలేకపోయారు. వైజాగ్ లో చేసిన హడావుడి మైలేజ్ ఇస్తుందని భావించి తప్పు చేశారు. అదికాస్త వైజాగ్ లో స్థలాలు అడగడానికే సరిపోయింది. 

54 సినిమాలు తీశానని చెప్పుకునే అరవింద్ లెక్క ఈసారి తప్పింది. సినిమా ప్రచారం విషయంలో ఆయన యువతరం టీమ్ కు వదిలేసినట్టున్నారు.  దీనివల్ల మిడిమిడి జ్ఞానంతో వారు ప్లానింగ్ చేసి చావుదెబ్బకొట్టారు. ఇప్పుడు జరిగిన నష్టాన్ని పూడ్చడానికి, సోమవారం నుండి కలక్షన్లు పడిపోకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నారు.

మెగా కుటుంబసభ్యులు వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కొంటున్నారు. సర్దార్.. చేసిన గాయం సరైనోడు మాన్చుతుందని అనుకుంటే నిరాశేమిగిలే సూచనలు కనిపిస్తున్నాయి. సరైనోడు విషయంలో ట్రేడ్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ అయ్యే సూచనలు లేవని వారు అంటున్నారు. కానీ భారీ ఎత్తున ప్రచారం చేసి నిలబెడతామని అల్లు వారు హామీ ఇచ్చారట.

sarrainodu
allu arjun
publicity
allu aravind
sarrainodu pre publicity