బోయపాటి ఆమెను వదలట్లేదు..!

ఒక హీరో, హీరోయిన్ నటించిన సినిమా హిట్ అయితే అదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తుంటారు. అయితే కేవలంలో హీరో, హీరోయిన్స్ కే కాకుండా అప్పుడప్పుడు డైరెక్ట‌ర్‌, హీరోయిన్‌ల కాంబినేషన్ కూడా రిపీట్ చేస్తుంటారు. రీసెంట్ గా బోయపాటి, అల్లు అర్జున్ హీరోగా, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా 'సరైనోడు' చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాలో బోయపాటి, రకుల్ ను కొత్తగా చూపించాడు. రకుల్ హార్డ్ వర్క్ కూడా బోయపాటికి నచ్చడంతో తన తదుపరి సినిమాలో కూడా రకుల్ నే హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడట. స‌రైనోడు త‌ర‌వాత బోయ‌పాటి శ్రీ‌ను బెల్లంకొండ శ్రీ‌నివాస్‌తో ఓ సినిమా చేయాల్సివుంది. అందులో క‌థానాయిక‌గా ర‌కుల్‌ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మే నెలలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

rakul preet singh
boyapati sreenu
sarainodu