ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఈ భామకి ఇప్పుడు ఓ ఇంటిదవుతుంది!

బాలీవుడ్ లో హీరోయిన్ గా చాలా సినిమాల్లో నటించి.. ఆ మద్య వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాతో తెలుగులో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రీతీ జింతా గుర్తుందా ! ఇలా అనేకంటే ఈ మద్య ఐ పి ఎల్ ఫ్రాంచైజ్ ని తీసుకున్న ప్రీతీ జింతా అంటే అందరికి గుర్తుంటుందేమో . ఎందుకంటే ఈమె సినిమాలు మానేసి చాలా కాలం అయింది కదా. ఇంతకి అసలు విషయం ఏమిటంటే .. ఇన్నాళ్ళకు ఈ భామకు పెళ్లి కుదిరింది. గత కొన్ని రోజులుగా ఆమె ఓ వ్యక్తి తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అతగాడినే పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. లాస్ ఏంజిల్ కు చెందిన ప్రముఖ బిజినెస్ మెన్ అయిన ఇతగాడిని పెళ్లి చేసుకునేందుకు రెడీ అయ్యింది. వీరి పెళ్లి ముంబై లోనే జరగనుందట . త్వరలోనే పెళ్లి తేది ప్రకటించే అవకాశం ఉంది. ఇన్నాళ్ళకు ప్రీతీ జింతా ఓ ఇంటిదవుతుందన్నమాట !
preity zinta
preity zinta marriage news
preity zinta ready to marriage
preity zinta marriage soon







































