శ్రీవాస్ మరో బోయపాటి అవుతాడా..?

‘డిక్టేటర్’ చిత్రానికి ముందు దర్శకుడు శ్రీవాస్ ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా పాపులర్ అవ్వలేదు. అతని కెరీర్‌లో లక్ష్యం, లౌక్యం విజయవంతమైన చిత్రాలుగా నిలిచినా.. ‘డిక్టేటర్’ చిత్రానికి లభించిన పబ్లిసిటి లభించలేదనే చెప్పాలి. ‘డిక్టేటర్’ విడుదలకు ముందే శ్రీవాస్ పేరు అందరిలోనూ నానుతుంది. అంతేకాదు ఇటీవల జరిగినా ‘డిక్టేటర్’ ఆడియో వేడుకలో బాలకృష్ణ శ్రీవాస్‌ను ప్రశంసలతో ముంచెత్తటం.. నా మనస్తత్వానికి తగ్గ కథతో శ్రీవాస్ ‘డిక్టేటర్’ను అద్భుతంగా తీశాడని.. నాలాగే శ్రీవాస్ ముక్కుసూటిగా వుంటాడని చెప్పడంతో.. శ్రీవాస్‌పై బాలయ్య అభిమానులకు మరింత అంచనాలు పెరిగాయి. శ్రీవాస్ కూడా బాలకృష్ణ అభిమానులు తలెత్తుకుని గర్వంగా తిరిగే సినిమాగా ‘డిక్టేటర్’ వుంటుందని చెప్పడంతో ఇక ఫ్యాన్స్ ఆనందానికి ఎల్లలు లేవు. అయితే ఫ్యాన్స్‌కు శ్రీవాస్ మరో బోయపాటి శ్రీను లా కనిపిస్తున్నాడట.. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న బాలయ్యకు వరుసగా సింహా లెజండ్ రూపంలో భారీ విజయాలు అందించాడు బోయపాటి. ఇక శ్రీవాస్ కూడా బాలయ్య ప్రతిష్టాత్మకంగా.. కీలకంగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ‘డిక్టేటర్’ రూపంలో బ్లాక్‌బస్టర్ ఇస్తాడని ఆశిస్తున్నారు. 

balakrishna
boyapati srinu
sriwaas
dictator
dictator movie
sriwaas another boyapati for balayya