సుక్కుని పైకెత్తేసిన ఆ కొంతమంది ఇప్పుడేమంటారో?

కొత్తదనం అంటే సుకుమార్ అనీ, సుకుమార్ అంటేనే కొత్తదనమనీ, వైవిధ్యమంటే సుకుమార్ కథల్లోనే వుంటుందనీ... సుకుమార్‌ని ఓ రేంజ్‌లో ఎత్తేసిన కొంతమంది ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? సుకుమార్ డైరెక్షన్‌లో వచ్చిన అంతకుముందు సినిమాల సంగతి పక్కన పెడితే లేటెస్ట్‌గా సుకుమార్ కథ, స్క్రీన్‌ప్లే అందించిన కుమారి 21ఎఫ్ ఓ ఇంగ్లీష్ సినిమా నుంచి లిఫ్ట్ చేసిందనీ, కేవలం మన తెలుగు నేటివిటీకి ఈ కథని మార్చుకున్నారని, ప్రతి సీన్ అందులో నుంచి తీసుకున్నదేనని వెబ్‌సైట్స్‌లో రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ విషయం తెలియని కొంతమంది సినిమాని, సుకుమార్‌ని, డైరెక్టర్‌ని ఆకాశానికి ఎత్తేసి తెలుగు సినిమా చరిత్రలో ఇది చిరస్థాయిగా నిలిచిపోయే సినిమా అని అభివర్ణించేశారు. ఇప్పుడు వాళ్ళకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
కుమారి 21ఎఫ్ చిత్రం కేవలం యూత్‌ని టార్గెట్ చేస్తూ తీసిన సినిమా అని యూనిట్‌లోని అందరూ చెప్తున్నారు. సినిమాలో ఎంత మంచి మెసేజ్ వున్నా, యూత్‌ని ఎడ్యుకేట్ చేసేది అయినా చివరి 10 నిముషాల్లో మాత్రమే ఆ మెసేజ్ చెప్పి మొదటి 2 గంటల సినిమాలో ఎడల్డ్ సీన్స్ చూపించి, ఎడల్డ్ డైలాగ్స్ చెప్పిస్తే యూత్ దానికే కనెక్ట్ అవుతారు తప్ప చివర్లో ఇచ్చిన మెసేజ్ వారికి ఎక్కుతుందా? మంచి మెసేజ్ ఇస్తున్నామంటూ ఇలాంటి కాన్సెప్ట్‌లతో సినిమాలు తీసి యువత ఆలోచనలను పొల్యూట్ చేసే దర్శకనిర్మాతలు వున్నంత కాలం, వారిని ఆకాశానికి ఎత్తేసే కొంతమంది వున్నంత కాలం ఇలాంటి సినిమాలకు కలెక్షన్ల పరంగా ఎలాంటి ఢోకా వుండదు.







































