చిరు అవుట్, ఎన్టీయార్ ఇన్

దర్శకుడిగా వీవీ వినాయక్ అందరు స్టార్ హీరోలకు బాగా కావాల్సినవాడు. చిరంజీవి లాంటి వారు సైతం వినాయక్ దర్శకుడిగా ఉంటేనే నూట యాభయ్యో సినిమా గురించి ఆలోచిస్తాడు అన్న స్థాయిలో ఈయనకు క్రేజ్ ఉంది. కానీ అంతటి పిచ్చి కాస్తా ఒక్క అఖిల్ సినిమాతో హుష్ కాకి అయింది. యాభై కోట్లు పై చీలుకు ఈ ప్రాజెక్టు మీద వెచ్చించినా కనీసం పాతిక కోట్ల నాణ్యత కూడా దక్కకపోవడంలో వినాయక్ పాత్ర మీదే అందరు అనగా అక్కినేని అభిమానులు అందరూ చురకలు తగిలించారు. అందుకే వినాయక్ వేడి తగ్గేవరకు ఇక్కడే ఉంటె ప్రమాదం అనుకోని సీన్ నుండి సేఫుగా ఎస్కేప్ అయ్యారు. ఎంత చేసినా చిరంజీవి సినిమా టాపిక్ వచ్చిన ప్రతిసారీ వినయ్ అన్న పేరే ముందు ఉంటోంది. అసలు విషయం ఏమిటంటే మెగా స్టార్ గారు కూడా తన సినిమా ఆలోచనలను కొద్ది కాలంపాటు ఓ పక్కకు పెట్టేసారని తెలుస్కున్న వినాయక్ కన్ను ప్రస్తుతం జూనియర్ ఎన్టీయార్ హీరోగా అదుర్స్ 2 మీదకు మల్లిందట. అదుర్స్ ఫస్ట్ పార్ట్ సూపర్ హిలేరియస్, మరి అదే రచయిత కోన వెంకట్ టీం మీద నమ్మకంతో జూనియర్ డేట్లు ఇస్తాడా అన్నదే సస్పెన్సు. మరి ఈసారి కూడా వినాయక్ అదుర్స్ అనిపిస్తారా లేక బెదుర్స్ అంటారా...

adhura 2
vv vinayak
jr ntr
kona venkat
akhil