మాయనే మళ్ళీ త్రిపురగా తీశారా?

డ్రీమ్స్ (కలలు) కాన్సెప్టు మీద నిన్న విదుదలైన త్రిపుర చిత్రానికి డివైడెడ్ టాక్ స్ప్రెడ్ అవుతున్న సంగతి తెలిసిందే. కథ, ఆలోచన గొప్పగా ఉన్నా కథనంలో బిగి సడలడంతో సినిమా మొత్తంలో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒక వైపు సస్పెన్సు, మరో వైపు హారర్, ఇంకో వైపు కామెడీ, ఇంకేదో వైపు డ్రామా నడపడంతో ఈ త్రిపుర ఏ జోనర్లోకి వెళుతుందో అన్న ఆలోచనలో ఉండగానే శుభం కార్డు వేసేసారు.
పైగా ఎకస్ట్రా సెన్సరీ పర్సెప్షన్ (ESP) అనే ఈ కలల్లో వచ్చే వాటిని నిజజీవితంలోని సంఘటనలతో గుర్తించి, క్రోడీకరించే స్పెషల్ లక్షణం ఉన్న వ్యాధిగ్రస్తుల కథని ఇంతకు మునుపు చాలా చిత్రాల్లో వాడినప్పట్టికీ మొన్నటికి మొన్న నీలకంట గారు తీసిన మాయా చిత్రం మనను ఎక్కువగా గుర్తుండి పోయేలా చేసింది. బాక్సాఫీసు దగ్గర మాయా ఎటువంటి మాయ చేయకుండా వెంటనే మాయం అయిపొయింది. అలాంటి కథనే మళ్ళీ నమ్ముకుని, ట్రీట్మెంట్ మీదే బేస్ అవాల్సిన థ్రిల్ ఎలిమెంట్స్ మిస్ చేసిన దర్శకుడిగా రాజ్ కిరణ్ కూడా విఫలమయ్యాడు. ఇంకొందరైతే అదేంటి మాయానే కామెడి జత చేసి మళ్ళీ తీసాడు కదబ్బా... అంటూ నిట్టూర్చారు. అక్కడా ఇక్కడా తేడా ఒక్కటే... మాయాకేమో జరిగేది ముందే కనపడితే... త్రిపురకేమో జరిగిందే మళ్ళీ కనపడితే.







































