ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
అనుష్క ఓకే చేసిందా..?

అనుష్క కోసం 'భాగమతి' అనే ఓ కథను తయారు చేసికొని ఆమె ఎప్పుడు డేట్స్ ఇస్తుందా? అని ఎదురుచూస్తున్నాడు 'పిల్లజమీందార్' ఫేమ్ అశోక్. లేడీ ఓరియంటెడ్‌గా 'అరుంధతి' తరహాలో సాగే చిత్రమిది. ఎలాగైనా అనుష్కతో ఆ కథను తెరకెక్కించాలని అశోక్ ఆమెకు కథ కూడా చెప్పాడు. అది అనుష్కకూ నచ్చింది. అయితే సినిమా చేస్తానని మాత్రం ఆమె ఖచ్చితంగా చెప్పలేదు. 'బాహుబలి, రుద్రమదేవి, సైజ్‌జీరో' చిత్రాలతో బిజీ బిజీగా ఉన్న అనుష్క ఆ సమయంలో అతనికి డేట్స్ అడ్జెస్ట్ చేయలేక మౌనం వహించింది. ఈ స్టోరీకి స్వీటీనే పర్‌ఫెక్ట్ అనుకున్న అశోక్ కూడా అనుష్క మౌనంగా ఉందని, వేరే వారిని తీసుకోకుండా ఆమె కోసమే ఎదురుచూస్తూ కూర్చున్నాడు. ఎట్టకేలకు ఆయన నిరీక్షణ ఫలించిందని టాలీవుడ్ సమాచారం. జేజెమ్మ ఈ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేసింది. జనవరిలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.
anushka
arundathi
pilla jamindar
ashok
size zero







































