వరుణ్‌తేజ్‌తో సినిమా చేయనున్న దర్శకరచయిత!

తన మొదటి చిత్రం ముకుందతో పెద్దగా విజయం సాధించలేకపోయిన మెగాహీరో, మెగాబ్రదర్‌ నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్‌ ప్రస్తుతం క్రిష్‌ దర్శకత్వంలో చేస్తున్న కంచె చిత్రంపై భారీ ఆశలు పెట్టుకొని పెట్టుకొన్నాడు. ఈ చిత్రం 22వతేదీన విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఈ చిత్రం తర్వాత వరుణ్‌తేజ్‌ హీరోగా పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం విడుదలకానుంది. ఈ రెండు చిత్రాల తర్వాత దర్శకరచయిత వీరుపోట్ల దర్శకత్వంలో వరుణ్‌తేజ్‌ ఓ సినిమా కమిట్‌ అయినట్లు సమాచారం. ఈ విషయమై ఇటీవలే వీరుపోట్ల నాగబాబు, వరుణ్‌తేజ్‌లను కలిసి చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నల్లమలుపు బుజ్జి నిర్మించనున్నాడని.. స్వతహాగా మంచి రచయిత అయినప్పటికీ వీరుపోట్ల ఈ చిత్రాన్ని తన సొంత కథతో కాకుండా వెలిగొండ శ్రీనివాస్‌ అందించిన కథతో తెరకెక్కించనున్నాడని సమాచారం. మొత్తానికి మెగాహీరో వరుణ్‌తేజ్‌ తదుపరి చిత్రం కూడా ఖరారైపోయిందని అంటున్నారు. 

veerupotla
varun tej
kanche movie
nagababu