శ్రీనివాస ఆర్ట్ క్రియేషన్స్ తొలి చిత్రం త్వరలో!

శివాజీ చౌదరిను హీరోగా పరిచయం చేస్తూ.. శ్రీ శ్రీనివాస ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై మాస్టర్ అభితేజ్ సమర్పణలో నూతన చిత్రం ప్రారంభం కానుంది. సి.హెచ్.వెంకటేశ్వరావు దర్శకుడు. వినోద్ కుమార్ నిర్మాత. ఈ సందర్భంగా..
నిర్మాత వినోద్ కుమార్ మాట్లాడుతూ.. శివాజీ స్టూడెంట్ ప్రెసిడెంట్ గా పని చేసారు. ఆయనను ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాం. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇదొక రొమాంటిక్ యాక్షన్ మూవీ. షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నాం.. అని చెప్పారు.
శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో షూటింగ్ ప్రారంభిస్తాం. రొమాంటిక్ యాక్షన్ సన్నివేశాలతో పాటు సినిమాలో కామెడీ కూడా ఉంటుంది.. అని చెప్పారు.
శివాజీ చౌదరి మాట్లాడుతూ.. ఇప్పటివరకు స్టూడెంట్ ఫోర్స్ లీడర్ గా పని చేసాను. ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వడం హ్యాపీగా ఉంది. కథ వినగానే చాలా నచ్చింది. వినోద్ నాకు బ్రదర్ లాంటి వాడు ఆయన ఈ సినిమాను నిర్మిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో మాస్టర్ అభితేజ్ కీ రోల్ లో నటిస్తున్నాడు. ప్రేక్షకులు ఆదరించాలని ఆశిస్తున్నాను.. అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో మురళి వై కృష్ణ, బేబీ రావు, నాగరాజు, చందు, అభితేజ్, సమీర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: రఘు, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: మురళి వై కృష్ణ, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీనివాసు, నిర్మాత: వినోద్ కుమార్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సి.హెచ్.వెంకటేశ్వరావు.







































