అయ్యో పాపం..నాగశౌర్య!

జాదూగాడు చిత్రం ఫ్లాప్‌ అందరికంటే ఎక్కువగా హీరో నాగశౌర్యపై ఎఫెక్ట్‌ చూపించింది. దీంతో తాజాగా ఆయనకు రెండు చాన్స్‌లు మిస్సయ్యాయని తెలుస్తోంది. మల్లెలతీరంలో.. సిరిమల్లె పువ్వు చిత్రం దర్శకుడు రామరాజు దర్శకత్వంలో మధురశ్రీధర్‌, టీవీ9లు సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రంలో హీరోగా మొదట నాగశౌర్యనే అనుకున్నారని సమాచారం. కానీ ఇప్పుడు ఈ సినిమాలో నాగశౌర్య బదులు జ్యోతిలక్ష్మీ ఫేమ్‌ సత్యను హీరోగా తీసుకున్నారు. తాజాగా నాగశౌర్యకు మరో మంచి అవకాశం మిస్సయిందని తెలుస్తోంది. ఊహలు గుసగుసలాడే ఫేమ్‌ అవసరాల శ్రీనివాస్‌ ఈ చిత్రానికి సీక్వెల్‌ చేస్తున్నాడు. దీనికి నాగశౌర్య నే హీరో అని చెప్పారు. అయితే చివరి క్షణంలో ఆ స్థానంలోకి నారా రోహిత్‌ను తీసుకున్నారు. జోఅచ్యుతానంద అని టైటిల్ కూడా అనౌన్స్ చేసారు. దీంతో అందరూ అయ్యో...పాపం..నాగశౌర్య అంటున్నారు. వాస్తవానికి ఇది నాగశౌర్య చేసిన స్వయంకృతాపరాధమే అని చెప్పకతప్పదు. 

jo achyutananda
naga sourya
nara rohit
rama raju
jo achyutananda movie details
naga sourya disappointed