సరైనోడుతో అల్లు ఆర్యన్‌ ఎంట్రీ..!

త్వరలోనే స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌ ముద్దుల కుమారుడు అల్లు ఆర్యన్‌ వెండితెరపై కనిపించనున్నాడా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. ఈమేరకు అల్లుఅర్జున్‌ని దర్శకుడు అడిగినట్లు సమాచారం. ప్రస్తుతం అల్లుఅర్జున్‌ బోయపాటిశ్రీను దర్శకత్వంలో సరైనోడు అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని స్వయంగా అల్లుఅరవింద్‌ గీతాఆర్ట్స్‌ పతాకంపై నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లుఆర్యన్‌ కనిపించనున్నాడని సమాచారం. గతంలో ఇదే వయసులో నాగ్‌ కుమారుడు అఖిల్‌ సిసింద్రీ సినిమాలో నటించాడు. ఇక మహేష్‌ తనయుడు గౌతమ్‌కృష్ణ 1(నేనొక్కడినే)చిత్రంతో ఎంట్రీ ఇవ్వగా ఇటీవల వచ్చిన భలే భలే మగాడివోయ్‌ చిత్రంంలో హీరో సుధీర్‌బాబు తనయుడు బాలనటునిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈకోవలోనే అల్లుఅర్జున్‌ కూడా తన కుమారుడిని తమ సొంత చిత్రం సరైనోడు తో వెండితెరకు పరిచయంచేయాలనే ఆశతో ఉన్నాడు.

allu arjun
alla aryan
sarainodu movie
boyapati sreenu