బాహుబలి సీక్రెట్ లీక్..!

ఇండియన్‌ సినిమా చరిత్రలోనే ఓ విజువల్‌ వండర్‌ రాజమౌళి బాహుబలి. ప్రేక్షకులకు కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో మంత్రముగ్ధులను చేసింది. మాయానగరం మాహిష్మతి, అబ్బురపరిచే జలపాతాలు, ఉత్కంఠ రేపే యుద్ద సన్నివేశాలు, భయం కలిగించే కాలకేయ సైన్యం.... ఇలా హాలీవుడ్‌ భారీ యాక్షన్‌ సినిమాలకు ఏమాత్రం తీసిపోకుండా ఇండియన్‌ సెల్యూలాయిడ్‌పై రాజమౌళి అండ్‌ టీం ఒక అద్భుతమే సృష్టించింది. బాహుబలి సినిమా విజువల్‌ ఎఫెక్ట్స్‌ వెనక ఉన్న రహస్యాని బయటపెడూతూ.. ఈ చిత్రానికి విఎఫ్‌ఎక్స్‌ అందించిన మకుట సంస్థ ఈ అద్భుతాలకు కారణమైన అసలు విషయాన్ని బహిర్గతం చేసింది. రమ్యకృష్ణ నదిలో కొట్టుకుపోతూ ఓ చేతిలో బిడ్డను పట్టుకుంటుంది. వాస్తవానికి ఆమె చేతిలో ఓ వాటర్‌ బాటిల్‌ను పట్టుకుందిట. తర్వాత దానికి విజువల్‌ ఎఫెక్ట్స్‌ జోడించి మనకు అద్భుతంగా చూపించారు. అదేవిధంగా సినిమాలోని జలపాతాలు, ప్రభాస్‌ విన్యాసాలు, మాహిష్మతి రాజ్యం.. ఇవ్వన్నీ కూడా విజువల్‌ ఎఫెక్ట్స్‌ మాయే అని ఆ సంస్థ గుట్టువిప్పింది. 

bahubali
prabhas
rajamouli
ramyakrishna
anushka