ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
మహేష్‌బాబుకు మూడో హీరోయిన్ దొరికింది..!!

మహేష్‌బాబు, శ్రీకాంత్ అడ్డాల కాంబినెషన్‌లో బ్రహ్మూెత్సవం సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించాల్సి ఉండగా.. ఇప్పటికి ఇద్దర్ని ఫైనలైజ్ చేశారు. 'అత్తారింటికి దారేది..' సినిమాలో నటించిన సమంతా, ప్రణీతలు ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లుగా ఎంపికయ్యారు. ఇక మిగిలిన మూడో హీరోయిన్ అవకాశం ఎవరికి దొరకనుందోననేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అయితే మహేష్ సరసన నటించే మూడో హీరోయిన్‌లో తెలుగ దనం ఉట్టిపడేలా ఉండేలాని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు పలువురు హీరోయిన్లను పరిశీలించిన ఆయన రాశీఖన్నాను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఇక మహేష్ సరసన నటించే అవకాశం దక్కనుందనే సమాచారం రాగానే రాశీఖన్నా ఎగిరి గంతేసి ఒప్పుకున్నట్లు తెలిసింది. మహేష్ పక్కన నటించే అవకాశం దక్కితే రాశీఖన్నా కెరియర్ సెటిలైనట్లే.
rashi khanna
mahesh babu
bramohthsavam
srikanth addala







































