కండోమ్ యాడ్‌కు ఓకే చెప్పిన ఇలియానా..!!

క్షిణాదిన టాప్ పొజిషన్‌లో ఉండగానే ఇలియానా ఇక్కడి కుర్రకారును పట్టించుకోకండా బాలీవుడ్‌కి చెక్కేసింది. అయితే మొదట్లో అక్కడ ఆమెకు ఆఫర్లు బాగానే వచ్చినా.. రానురాను పూర్తిగా ఇలియానాను బాలీవుడ్ వర్గాలు పూర్తిగా పక్కకు పెట్టేశాయి. దీంతో సూపర్‌హాట్ ఫొటో షూట్‌లతో ఇలియానా కాలం గడుపుతోంది. ఇప్పుడు ఈ హాట్ ఫొటో షూట్లే ఆమెకు ఓ మెగా అవకాశాన్ని దక్కించాయి.
ఇలియానా ఓ కండోమ్ యాడ్‌లో నటించడానికి ఓకే చెప్పినట్లు సమాచారం. మొదట ఈ ఆఫర్ దక్షిణాది ముద్దుగుమ్మ కాజల్‌కు వచ్చింది. దాదాపు రూ. కోటి ఆఫర్ చేసినా ఈ యాడ్‌పై తేల్చకుండా కాజల్ కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో సదరు కంపెనీ కాజల్‌ను పూర్తిగా పక్కకు పెట్టేసి ఇప్పుడు ఇలియానాను సంప్రదించినట్లు సమాచారం. ఇప్పటికే పని లేక పూర్తిగా ఖాళీగా ఉన్న ఇలియానా వెంటనే ఆ కంపెనీకి ఓకే చెప్పింది. అయితే రెమ్యూనరేషన్‌గా రూ. కోటి తీసుకుంటుందా..? లేక అంతకంటే ఎక్కువేనా అన్నది తేలియాల్సి ఉంది. సాధారణంగా వెండితెరపై ఇలియానా కనబడితేనే పండుగ చేసుకునే కుర్రకారు ఇక.. ఆమె కండోమ్ యాడ్‌లో ఎంతగా మురిపిస్తోందనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







































