‘బాహుబలి’పై విమర్శలు చేసిన సురేష్...!

ఒకప్పటి చిన్న హీరో, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన నటుడు సురేష్. ఇటీవల ఆయన లెగ్ పెట్టిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గా నిలుస్తున్నాయి. కాగా ఆయన రాజమౌళి ‘బాహుబలి’పై కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే చెప్పాలంటే... రాజమౌళి మరియు బాహుబలిని నేను సపోర్ట్ చేయను. ఎందుకంటే జగపతిబాబు, సుమన్, సాయికుమార్ వంటి వారికి ‘బాహుబలి’లోని పాత్రలు సరిగ్గా సూటవుతాయి. కానీ ఆయన అలా ఎందుకు ఆలోచించలేదు.. అంటూ ట్వీట్ చేశాడు. ఈ మాటల్లో ఆయనకు తెలుగులో మంచి కారెక్టర్లు రావడం లేదనే నిరాశ కనిపిస్తోందని, ఏ పాత్రకు ఏ ఆర్టిస్ట్‌ను తీసుకోవాలనే విషయంలో దర్శకునికి స్వేచ్చ ఉంటుందని, అందునా ‘బాహుబలి’ అనేక భాషల్లో విడుదల అవుతుంది కాబట్టి ఇక్కడ పరాయి ఆర్టిస్టులు అనే భావన తప్పని కొందరు వాదిస్తుంటే.. మరికొందరు మాత్రం సురేష్ మాట్లాడిరది వాస్తవమే. తెలుగు వారే తోటి తెలుగు ఆర్టిస్ట్‌లను పట్టించుకోకపోతే ఇతరులు ఎలా పట్టించుకుంటారు? అనే వాదన లేవనెత్తుతున్నారు. మొత్తానికి ‘బాహుబలి’లో సత్యరాజ్, నాజర్ వంటి నటులకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఇప్పుడు సురేష్ వ్యాఖ్యల వల్ల చర్చనీయాంశం అయింది.







































