నవ్వులు పంచేందుకు మళ్ళీ వచ్చాడు.!

కమెడియన్‌ సుధాకర్‌, అతని డైలాగ్‌ మాడ్యులేషన్‌, అతని కామెడీ టైమింగ్‌ అందర్నీ తెగ నవ్వించేవి. ఆ కామెడీ, ఆ కామెడీ టైమింగ్‌ కొన్ని సంవత్సరాలుగా మనకు కనిపించలేదు. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినవాడిలా ఏ సినిమాలోనూ, ఏ సినిమా ఫంక్షన్‌లోనూ కనిపించలేదు. ఇప్పుడు సడెన్‌గా సుధాకర్‌ ప్రత్యక్షమయ్యాడు. సాయిరామ్‌ శంకర్‌ నటిస్తున్న కొత్త సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నానంటూ మీడియా ముందుకొచ్చాడు. అసలు ఈ సుధాకర్‌ ఇన్ని సంవత్సరాలు ఏమైపోయినట్టు? ఎందుకు సినిమాలకు దూరంగా వున్నట్టు? ఈ ప్రశ్నలకు గతంలో రకరకాల సమాధానాలు వినిపించేవి. తాగుడు వల్ల తన కెరీర్‌ నాశనం చేసుకున్నాడని, అందుకే సినిమాల్లో కనిపించడం లేదని కథనాలు వినిపించాయి. ఒక సందర్భంలో తీవ్ర అనారోగ్యానికి గురై హాస్పిటల్‌ పాలయ్యాడని, మృత్యువుతో పోరాడుతున్నాడని వార్తలు వచ్చాయి. అందులో నిజానిజాలు ఎంతో తెలియదు గానీ ఇకపై వరసగా సినిమాలు చేస్తానంటున్నాడు సుధాకర్‌. సినిమాలకు దూరం కావడానికి తన అనారోగ్యమే కారణమని, తాగుడుకు బానిసవడం వల్ల నటనకు దూరం కాలేదని స్పష్టం చేశాడు సుధాకర్‌. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి, వినోదాన్ని అందించడానికి మళ్ళీ వచ్చానని, ఇకపై రెగ్యులర్‌గా సినిమాలు చేస్తానని హామీ ఇస్తున్నాడు కమెడియన్‌ సుధాకర్‌. 

comedian sudhakar
sudhakar in vaadu nenu kadu
sairam shankar new movie vadu nenu kadu