పూరి కోసం మెగాస్టార్‌ వస్తున్నాడు.!

టెంపర్‌ తర్వాత చాలా సినిమాలు కమిట్‌ అయి ఒక్కొక్కటిగా కంప్లీట్‌ చేసుకుంటూ వస్తున్న పూరి జగన్నాథ్‌ తన లేటెస్ట్‌ మూవీ ‘జ్యోతిలక్ష్మీ’ ఆడియో ఫంక్షన్‌ను రేపు(జూన్‌4) హైదరాబాద్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్‌ సెంటర్‌లో చాలా గ్రాండ్‌గా చెయ్యబోతున్నాడు. ఈ ఫంక్షన్‌కి మెగాస్టార్‌ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారని సమాచారం. తన 150వ సినిమాని డైరెక్ట్‌ చేస్తున్న పూరి కోసం మెగాస్టార్‌ ఈ ఫంక్షన్‌కి అటెండ్‌ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్‌, సినిమాలోని టైటిల్‌ సాంగ్‌ ఇటీవల విడుదలై హల్‌చల్‌ చేస్తున్నాయి. అలాగే ఈ సినిమాకి బిజినెస్‌పరంగా కూడా చాలా క్రేజ్‌ వచ్చింది. సి.కళ్యాణ్‌కి ఇది చాలా ప్రాఫిట్‌ ప్రాజెక్ట్‌ అవుతుందని ట్రేడ్‌ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే అన్ని ఏరియాల బిజినెస్‌ని కంప్లీట్‌ చేసారని సమాచారం. జూన్‌ 12న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నాడు నిర్మాత సి.కళ్యాణ్‌. 

puri jagannath movie jyothi lakshmi
charmi as jyothi lakshmi
c.kalyan
jyothi lakshmi movie on 12th june