పవన్‌ పనిపై బిజీగా ఉన్న త్రివిక్రమ్‌..!!

వన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. జల్సా, అత్తారింటికి దారేది వంటి బ్లాక్‌బాస్టర్‌ల తర్వాత హ్యట్రిక్‌ హిట్‌ ఇవ్వడానికి వీరిద్దరు సిద్ధమవుతున్నారు. గబ్బర్‌సింగ్‌-2 తర్వాత పవన్‌కల్యాణ్‌ త్రివిక్రమ్‌ డైరెక్షన్‌లో 'కోబలి' సినిమాలో నటిస్తాడని సమాచారం.

సన్నాఫ్‌ సత్యమూర్తి విజయం తర్వాత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ఇంకా ఏ ప్రాజెక్టుకు కమిట్‌ అవ్వలేదు. అయితే ఆయన ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌ సినిమా స్క్రిప్ట్‌పై బిజీగా ఉన్నట్లు సమాచార. వీరిద్దరి కాంబినేషన్‌లో 'కోబలి' రూపొదిద్దుకోన్నట్లు తెలుస్తోంది. జూన్‌ మొదటివారంలో పవన్‌కల్యాణ్‌ 'గబ్బర్‌సింగ్‌-2' షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తయ్యేలోపు 'కోబలి'ని స్క్రిప్ట్‌తోసహా రెడీ చేయడానికి త్రివిక్రమ్‌ సన్నాహాలు చేస్తున్నాడు. మరి వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో ఏమేర అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆ అంచనాలను అందుకోవడానికే నెలల తరబడి కష్టపడి త్రివిక్రమ్‌ స్క్రిప్ట్‌ సిద్ధం చేస్తున్నట్లుంది.

pawanl kalyan
trivikram
kobali
gabbar singh 2