ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ ఎంచుకున్న రామ్‌చరణ్‌..!!

రామ్‌చరణ్‌, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా కొనసాగుతోంది. అయితే ఈ సినిమా టైటిల్‌ విషయమై టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్‌ న్యూస్‌ చక్కర్లు కొడుతోంది. మార్షల్స్‌ ఆర్ట్స్‌కు పితామహుడిగా చెలామణి అవుతున్న బ్రూస్‌ లీ పేరును తన తదుపరి సినిమాకు టైటిల్‌గా రామ్‌చరణ్‌ ఎంచుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

ఇప్పటికే రామ్‌చరణ్‌, శ్రీనువైట్లల మూవీ పేరు 'మే నేమ్‌ ఈజ్‌ రాజు'గా చెలామణిలో ఉంది. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు 'బ్రూస్‌ లీ' అనే టైటిల్‌ వినబడటం ఆశ్యర్యానికి గురిచేస్తోంది. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు 'బ్రూస్‌ లీ' అనే టైటిల్‌ను పెట్టడంపై మెగా అభిమానులు కూడా ఆనందంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే టైటిల్‌ కన్‌ఫర్మ్‌ అయితే ఈ సినిమాలో యాక్షన్‌ భారీగా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.

ram charan
srinu vaitla
mu name is raju
bruce lee
title