ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >>
ఎన్టీఆర్ ని టార్గెట్ చేస్తూ 'లయన్' డైలాగ్స్!

జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణల మద్య ఇంకా పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటునే ఉంది. తారక్ పేరు వింటేనే బాలయ్య ఊగిపోతున్నాడు. ఇటీవల మీడియా ఆయన్ను ఎన్టీఆర్ విషయం చెప్పమని ప్రశ్నిస్తే మీడియాపై భగ్గుమన్నాడు. కాగా త్వరలో విడుదల కానున్న ‘లయన్’ చిత్రంలో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి రెండు మూడు పంచ్ డైలాగులు విసినట్లు అవి సూటిగా ఎన్టీఆర్‌పైనే ఎక్కుపెట్టినట్లు సమాచారం. మరి ఈ డైలాగ్స్ కేవలం బాలయ్య అభిమానులను అలరిస్తాయి సరే.. మొత్తంగా నందమూరి అభిమానులు ఈ సెటైరిక్ డైలాగ్‌లకు ఎలా స్పందిస్తారు? తారక్ అభిమానులు వీటికి ధీటుగా ఏంచెప్తారు? నందమూరి కుటుంబంలో ఎదురవుతోన్న విభేధాలకు ఈ డైలాగ్స్ అగ్నికి ఆజ్యం పోస్తాయోమో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
nbk lion
lion movie
jr ntr
balakrishna
controversy dialogues







































