‘మనం’ చానెల్ నిజమేనా!

నిన్న మొన్నటివరకు నాగార్జున, చిరంజీవి, అల్లుఅరవింద్, నిమ్మగడ్డ ప్రసాద్ తదితరుల భాగస్వామ్యంతో నడిచిన ‘మా టీవీ’నెట్‌వర్క్ చానెల్స్‌ను స్టార్ ఇండియా సంస్థ భారీ ఒప్పందంతో సొంతం చేసుకుంది. ఈ ఒప్పందం విలువ దాదాపు 2000కోట్లపై మాటే అని సమాచారం. అయినా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న ‘మాటీవీ’ నెట్‌వర్క్‌ను ఎందుకు అమ్మేశారు..? అనేది మాత్రం ఎవ్వరి ఊహకు అందని ప్రశ్నగా మిగలిపోయింది. తాజా సమాచారం ప్రకారం నాగార్జున త్వరలో మరో టీవీ చానెల్‌ను స్థాపించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ‘మాటీవీ’ అమ్మకపు ఒప్పందంతో కనీసం ఐదేళ్లపాటు నాగ్‌తో సహా మిగిలిన వారు ఇదే రంగంలోకి వెంటనే ప్రవేశించకూడదు అనే నిబంధనను స్టార్ ఇండియా వారు పెట్టినందు వల్ల నాగ్ ఈసారి తాను వెనకుండి ఈ చానెల్‌ను స్థాపిస్తున్నాడని, ఈ చానెల్ పెట్టుబడిని మొత్తం పివిపి భరిస్తున్నట్లు తెలుస్తోంది. నాగ్ ఇందులో స్లీపింగ్ పార్ట్‌నర్‌గా ఉంటాడు. అది కూడా అనఫిషీయాల్‌గా మాత్రమే. కాగా ఈ చానెల్‌కు ‘మనం’ చానెల్ అనే పేరును కూడా పెట్టారని, పూర్తి వినోదాత్మక ఛానెల్‌గా ఉండే ఈ ఛానెల్ ఏర్పాటుకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ తెర వెనుక సాగుతున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 24 నుండి ఈ చానెల్ టెస్ట్ సిగ్నల్ రిలే పరీక్షనించనున్నట్లు తెలుస్తోంది.







































