ఈ ఏడాది సూర్య హల్‌చల్‌!

కిందటి ఏడాది ‘అంజాన్‌’ (తెలుగులో ‘సికిందర్‌’)  చిత్రంతో డిజాస్టర్‌ ఇవ్వడంతో తమిళస్టార్‌ సూర్య అభిమానులు నిరాశచెందారు. దాంతో ఆయన ఈ ఏడాది వరుస చిత్రాలతో హల్‌చల్‌ చేసేందుకు సిద్దం అవుతున్నాడు. ఈ ఏడాది మే 1వ తేదీన ఆయన నటించిన ‘మాస్‌’ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. ఇంకా ఆయన నటించిన ‘హైకూ’, విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న ‘24’ చిత్రాలను కూడా ఇదే ఏడాది విడుదల చేయాలని సూర్య ప్లాన్‌ చేస్తున్నాడు. వీటిల్లో ఏదో ఒక చిత్రం భారీ హిట్టు అయితే మరలా తాను మునుపటి ట్రాక్‌లోకి వస్తానని ఆయన భావిస్తున్నాడు. మొత్తానికి ఈ ఏడాది సూర్య అభిమానులకు పండగే పండగ అని చెప్పాలి...!

suriya
sikindar
anjaan
24
mass
tamil hero
suriya movies