మరో మల్టీస్టారర్‌ ఖరారు....?

విక్టరీ వెంకటేష్‌`మాస్‌ మహారాజా రవితేజల కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ రానుందని చాలా రోజులుగా వినిపిస్తోంది. అయితే వీరిద్దరికి తగ్గ పర్‌ఫెక్ట్‌ స్టోరీ దొరకకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ లేటవ్వుతూ వస్తోంది. తమిళంలో గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై విజయ్‌`మోహన్‌లాల్‌లు కీలకపాత్రల్లో నటించిన ‘జిల్లా’ రీమేక్‌లో వీరిద్దరూ కలిసి నటించనున్నట్లు సమాచారం. విజయ్‌ పాత్రను రవితేజ, మోహన్‌లాల్‌ పాత్రను వెంకటేష్‌లు పోషిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రానికి వీరుపోట్ల రచన, దర్శకత్వం బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. కాగా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మేరకు తమిళ వెర్షన్‌లో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నాడట వీరుపోట్ల...!

venkatesh
raviteja
multi starer
mohanlal
veerupotla