తమిళంలోకి పరిచయమవుతోన్న చైతూ..!

మొదటి చిత్రంతో హిట్‌ కొట్టిన యువ దర్శకులకు రెండో చాన్స్‌ ఇవ్వడంలో నాగచైతన్య ముందున్నాడు. నిన్నటికి నిన్న ‘గుండెజారిగల్లంతయ్యిందే’ చిత్రంతో విజయం సాధించిన కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో ‘ఒక లైలా కోసం’ చిత్రం చేశాడు. కానీ ఈ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం ‘స్వామిరారా’తో హిట్‌ కొట్టిన సుధీర్‌వర్మ దర్శకత్వంలో ‘దోచెయ్‌’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది. కాగా ఆయన ‘కార్తికేయ’ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ‘దోచెయ్‌’ విడుదలైన వెంటనే ఈ చిత్రం పట్టాలెక్కనుంది. కాగా ఈ చిత్రాన్ని ఓ థ్రిల్లర్‌ కథాంశంతో చందు మొండేటి తెరకెక్కించనున్నాడు. కాగా ఈ సినిమాకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంతో నాగచైతన్య డైరెక్ట్‌ తమిళ చిత్రంలో నటిస్తూ.. అక్కడి ప్రేక్షకులను కూడా ఆకర్షించి తన మార్కెట్‌ పరిధిని పెంచుకోవడానికి ప్రయత్నంచేయనున్నాడు. మరి ఈ విషయంలో చైతూ ఎంతవరకు సక్సెస్‌ అవుతాడో వేచిచూడాల్సివుంది....!

konda vijaykumar
karthikvarma
dochey
chandu mondeti
thriller movie