స్పెయిన్ లో 'సన్ ఆఫ్ సత్యమూర్తి' టీమ్..!

తన డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఎక్కువ శాతం కామెడీకి ప్రాధాన్యత ఇచ్చే దర్శకుడు త్రివిక్రమ్. పవన్ తో 'అత్తారింటికి దారేది' సినిమా తరువాత ప్రస్తుతం అల్లు అర్జున్ తో చేస్తున్న 'సన్ ఆఫ్ సత్యమూర్తి' సినిమాలో బిజీగా ఉన్నాడు. మెగా అభిమానులను ఏ మాత్రం నిరాశ పరచకుండా ఉండేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన పాటల షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది. ఒక పాట మినహా మిగిలిన సినిమా షూటింగ్ అంతా కంప్లీట్ అయిందని సినిమా నిర్మాత రాధాకృష్ణ తెలిపారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన ఇద్దరు హీరోయిన్స్ సమంత, ఆదాశర్మ రొమాన్స్ చేయగా హీరోయిన్ నిత్య మీనన్ అల్లు అర్జున్ కు సోదరి పాత్రలో నటిస్తుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని సమకూరుస్తున్నారు. నటుడు రాజేంద్రప్రసాద్, ఉపేంద్ర, స్నేహ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది.







































