వెంకీ కి శృతి ఓకే అంటుందా...!

ఇటీవల కాలంలో సీనియర్ స్టార్స్ అయిన బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలకు హీరోయిన్ల సమస్య తలనొప్పిగా మారింది. యంగ్ టాప్ హీరోయిన్లు ఎవ్వరూవీరితో నటించడానికి ఒప్పుకోవడంలేదు. వీరి సరసన నటిస్తే తమను కూడా సీనియర్ల కింద లెక్కేసి యంగ్ హీరోల సరసన అవకాశం ఇవ్వరేమో అనేది వారి భయం. కాగా త్వరలో వెంకటేష్ సోలో హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ చిత్రాల దర్శకుడు దశరధ్ దర్శకత్వంలో  ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రానికి వెంకీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఫ్యామిలీ ఆడియన్స్ లో ఇప్పటికీ క్రేజ్ ఉన్న వెంకీతో ఫ్యామిలీ చిత్రాల స్పెషలిస్ట్ దశరధ్ చిత్రం అంటే అది ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గానే రూపొందుతుందని ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని, ఒకరు సీనియర్ హీరోయిన్ కాగా, మరొకరు యంగ్ హీరోయిన్ అవసరం అని తెలుస్తోంది. సీనియర్ హీరోయిన్ గా త్రిష, నయనతార, అనుష్క, శ్రియ వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. కాగా యంగ్ హీరోయిన్ కోసం శృతి హాసన్ ను సంప్రదించినట్లు సమాచారం. మరి ఈ ఆఫర్ ను శృతి హాసన్ ఒప్పుకుంటుందో లేదో చూడాల్సివుంది...! 

senior stars
balakrishna
nagarjuna
venkatesh
young heroines
family entertainer
sruthihasan