ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss 10: Neethu Master Faces Backlash After Nominations

బిగ్ బాస్ 10: సైకోలా బిహేవ్ చేసిన నీతూ మాస్టర్

Bigg Boss 10: Neethu Master Faces Backlash After NominationsBigg Boss 10: Neethu Master Faces Backlash After Nominations

బిగ్ బాస్ సీజన్ 10 లోకి వైల్డ్ కార్డు ద్వారా నాలుగు వారాల తర్వాత ప్రవేశించిన నీతూ మాస్టర్.. హౌస్ లోకి రావడం రావడమే ఆమె షాలిని ని టార్గెట్ చేస్తూ రోహిత్ కి దగ్గరైంది. రోహిత్ కి బయట ఫ్యాన్స్ సపోర్ట్ ఉండడంతోనే ఆమె తమ్ముడు అంటూ రోహిత్ కి దగ్గరైంది. ఆతర్వాత ఆమె టెంపర్ వంశి తో గొడవలు పెట్టుకోవడమే కాదు.. ముఖేష్ లాంటి వాళ్లతోను గొడవలు పడింది.

ఇక ప్రతి విషయానికి ఎమోషనల్ అయ్యే నీతూ మాస్టర్ గత రాత్రి నామినేషన్స్ ఎపిసోడ్ లో సైకోలా బిహేవ్ చేసింది అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. గత వారం త్రిగుణ తో గొడవ పడడమే కాకుండా.. అతను అనని మాటలు అన్నాడు అని హోస్ట్ నాగ్ ముందు చెప్పడం, ఆయన దానిని వీడియో వేసి నీతూ తప్పని నిరూపించారు.

ఆతర్వాత త్రిగుణ ని ఫేస్ చెయ్యలేక నీతూ, తనని టార్గెట్ చేసిన ఆమెను త్రిగున్ ఏడిపిస్తున్నారు. ఇక నామినేషన్స్ లో నీతూ ని శ్వేతా, నరేష్, త్రిగుణ, వంశి టార్గెట్ చేయడంతో డిపెండ్ చేసుకోలేక, సింపతీ క్రియేట్ చేసుకుంటూ ఏడవకు ఏడవకు, కొడతా అంటూ తనని తానె కొట్టుకోవడం, ఆమె చేసిన చేష్టలు అన్ని సైకోని గుర్తు చేసాయి అంటూ ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
 

Drama or Sympathy Game? Neethu Master Under Fire