ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Janhvi Kapoor in spotlight For Her comments on Peddi

ఇప్పట్లో జాన్వీ కపూర్ ని వదలరేమో?

Janhvi Kapoor in spotlight For Her comments on PeddiJanhvi Kapoor in spotlight For Her comments on Peddi


బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ సినిమా లుక్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియా లుక్ లో చాలా హాట్ గా కనిపిస్తుంది. ఆమె ఎక్కువగా అందాలు చూపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంది. బాలీవుడ్ మూవీస్ లో ఆమె గ్లామర్ రోల్స్ చెయ్యకపోయినా తెలుగులో దేవర, పెద్ది లో గ్లామర్ రోల్స్ చేసింది.

పెద్ది చిత్రంలో జాన్వీ కపూర్ ని బుచ్చి బాబు చూపించిన తీరు ఎవరూ హర్షించరు, కానీ ఎలాంటి ఎక్స్పోజింగ్ చెయ్యని అమ్మాయితో బుచ్చిబాబు అలాంటి గ్లామర్ రోల్ చేయించలేదు. ఆ విషయంలో బుచ్చిబాబు ని బాగా తిట్టారు. జాన్వీ కపూర్ పై విమర్శలొచ్చాయి, కానీ ఆమెను టార్గెట్ చెయ్యలేదు.

రీసెంట్ గా జాన్వీ కపూర్ కరణ్ జోహార్ షో లో పెద్ది పై చేసిన కామెంట్స్ ఆమెను మళ్లీ మళ్లీ ట్రోల్ చేసేలా చేస్తున్నాయి. నువ్వు మడికట్టుకుని కూర్చోలేదు, చిన్న పిల్లవి కాదు, నీకు నచ్చనపుడు ఈ కేరెక్టర్ వర్కవుట్ అవ్వదని దర్శకుడుకి చెప్పొచ్చు, కానీ ఇలా ఓ టాక్ షోలో పబ్లిక్ ప్లాట్ ఫామ్ పై చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆమెను బాగా టార్గెట్ చేస్తున్నారు.

అంతేకాదు జాన్వీ కపూర్ అందాలు చూపిస్తూ గ్లామర్ ఫొటోస్ వదిలితే చాలు పెద్ది మేటర్ ని పట్టుకొచ్చి ఇది గ్లామర్ షో కాదా జాన్వీ అంటూ మళ్లీ మళ్లీ ఆమెను సోషల్ మీడియా వేదికగా ఏసుకుంటున్నారు.

Janhvi Kapoor in spotlight