ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Bigg Boss Telugu 10 : Who is in the danger zone this week..!

BB10: ఈ వారం డేంజర్ జోన్ ఎవరంటే..!

Bigg Boss Telugu 10 : Who is in the danger zone this week..!Bigg Boss Telugu 10 : Who is in the danger zone this week..!

 

బిగ్ బాస్ సీజన్ 10 లో మూడోవారం నుంచే ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అయ్యి బయటికెళ్లిపోతుందో అని బిగ్ బాస్ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆమె ఎవరో కాదు యాంకర్ వర్షిణి.. ముఖేష్ తో లవ్ ట్రాక్ నడుపుతుంది తప్ప ఆమె టాస్క్ లు ఆడాడు, అమన్ కెప్టెన్సీ టాస్క్ గెలిస్తే దానిని మ్యాజిక్ కీతో లాగేసుకుంది వర్షిణి.

వర్షిణి రెండుమూడుసార్లు డేంజర్ జోన్ కి వెళ్లి సేవ్ అయ్యింది. ఒకసారి ముఖేష్ సేవ్ చేస్తే, మరోసారి షాలిని వలన సేవ్ అయ్యింది. ఇక ఈవారం పక్కాగా ఆడియన్స్ ఓట్స్ తో వర్షిణి ఎలిమినేట్ అవుతుంది అనుకుంటే ఆమెను గోట్ ని చేసారు ముఖేష్, రోహిత్ లు. అంటే మరో రెండు వారాలు వర్షిణిని హౌస్ లో భరించాల్సిందే.

ఇక ఆమె తరవాత వంశి డేంజర్ లో ఉన్నాడనుకుంటే అతనేమో త్రిగుణ ఫ్యాన్స్ ఓట్స్ తో టాప్ 2కి వెళ్ళిపోయాడు. అంతేకాదు ఇప్పుడు రెడ్ నుంచి ఎల్లో లెవల్ కి వెళ్ళాడు. ఇక ఈవారం సుధీర్, శ్వేతా, రోహిత్, ఝాన్సీ, రామకృష్ణ రెడ్ లో ఉంటే.. వాళ్ళు ఎవరో ఒకరు ముఖ్యంగా సుధీర్ లేదా రామకృష్ణ ఏ క్షణమైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

ఇక ఎల్లోలో ఉన్న నరేష్, వంశి , శివ్ లలో ఎవరో ఒకరు ఆడియన్స్ ఓట్స్ తో ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. తాజాగా బిగ్ బాస్ రోహిత్, రామకృష్ణ, సుధీర్, ఝాన్సీలను రెడ్ జోన్ లో నిలబెట్టి హౌస్ మేట్స్ ఓట్స్ తో ఎలిమినేషన్స్ స్టార్ట్ చేశారు. ఈ వారం ఝాన్సీ, సుధీర్, రామకృష్ణ లలో ఇద్దరు లేక ఒక్కరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది. 

Bigg Boss Telugu 10