ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Suriya 50: Rolex Standalone Film With Lokesh Kanagaraj

స్టార్ హీరో 50వ సినిమా: రోలెక్స్ స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్!

Suriya 50: Rolex Standalone Film With Lokesh KanagarajSuriya 50: Rolex Standalone Film With Lokesh Kanagaraj

 

తమిళ స్టార్ నటుడు సూర్య  వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద ఫుల్ జోరు మీదున్నారు. ప్రస్తుతం సూర్య  `జై భీమ్` ఫేమ్ టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఒక చిత్రం, `జననాయగన్` ఫేమ్ హెచ్. వినోద్‌తో మరో భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయిన వెంటనే సూర్య   కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన 50వ సినిమా పనులను ప్రారంభించనున్నారు. ఈ మైలురాయి చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నారు.

కమల్ హాసన్ కథానాయకుడిగా రిలీజ్ అయిన  `విక్రమ్` చిత్రంలో సూర్య పోషించిన `రోలెక్స్` పాత్ర ఎంతటి సంచలనం సృష్టించిందో  తెలిసిందే. కొన్ని నిమిషాల నిడివితోనే వెండితెరపై పూనకాలు తెప్పించిన ఆ క్యారెక్టర్‌ను పూర్తిస్థాయి స్టాండ్ అలోన్ సినిమాగా మార్చేందుకు లోకేష్ కనకరాజ్ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. సూర్య 50వ చిత్రం `రోలెక్స్` పాత్ర చుట్టూనే సాగే క్రైమ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.

ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయబోయే భారీ ప్రాజెక్ట్ (AA23) పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ లోగా సూర్య కూడా టి.జె. జ్ఞానవేల్, హెచ్. వినోద్‌లతో కమిట్ అయిన సినిమాల షూటింగ్‌లను శరవేగంగా పూర్తి చేయనున్నారు. అల్లు అర్జున్ సినిమా పూర్తయిన వెంటనే ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా లోకేష్ కనకరాజ్ నేరుగా సూర్య `రోలెక్స్` సెట్స్‌లోకి అడుగుపెట్టేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

రోలెక్స్ పాత్రకు ఉన్న క్రేజ్ దృష్ట్యా  50వ చిత్రాన్ని నిర్మించేందుకు కలైపులి ఎస్. థానుతో పాటు పరిశ్రమలోని పలువురు ప్రముఖ నిర్మాతలు  పోటీ పడుతున్నారు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లోనే అత్యంత పవర్ ఫుల్ డార్క్ క్యారెక్టర్‌గా నిలిచిన రోలెక్స్ కథ పూర్తిస్థాయిలో తెరపైకి రానుండటంతో సూర్య 50వ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి.
 

Suriya 50: Rolex Is Coming Back