డేటింగ్ పుకార్లపై న‌టుడు చ‌మ‌త్కారం!

Actor Jokes About Dating RumoursActor Jokes About Dating Rumours

 

బాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ నటుడు రోహిత్ సరాఫ్- నటి ప్రతిభా రంత మధ్య ప్రేమాయణం సాగుతోందంని కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోన్న సంగ‌తి  తెలిసిందే. ఇద్ద‌రు కలిసి నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా తరచూ కలిసి కనిపించడంతో  డేటింగ్‌లో ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్ సరాఫ్ తనదైన శైలిలో చమత్కారంగా బదులిచ్చి  పుకార్లన్నింటికీ స్వస్తి పలికారు.

ఇటీవల రోహిత్ సరాఫ్  ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రతిభా రంతాతో కలిసి ఉన్న కొన్ని క్యాండిడ్ చిత్రాలను పంచుకున్నారు. కార్ సెల్ఫీలు, లిఫ్ట్‌లో దిగిన సరదా ఫొటోలను షేర్ చేసి  తమ సిరీస్‌లోని మహియా పాట విడుదల కాబోతోందని క్యాప్షన్ ఇచ్చారు. ఈ ఫొటోలు చూసిన ఒక‌ నెటిజన్ కామెంట్ సెక్షన్‌లో.. `మీరిద్దరూ నిజంగా డేటింగ్‌లో ఉన్నారా? లేదా నటనా?` అని  ప్రశ్నించాడు. దీనికి రోహిత్ స్పందిస్తూ.. `లేదండీ సెప్టెంబర్ 11న విడుదల కాబోతున్న ఒక షోలో మేం ఇద్దరం కలిసి నటించాం. దయచేసి ప్రైమ్ వీడియోలో ది రివాల్యూషనరీస్ చూడండి" అని పంచ్‌తో కూడిన ప్రమోషనల్ సమాధానమిచ్చారు.

నిజానికి రోహిత్ సరాఫ్, ప్రతిభా రంతా మధ్య ఏదో ఉందనే ఊహాగానాలు 2025 చివరలో ప్రారంభమయ్యాయి.  దర్శకుడు నిఖిల్ అద్వానీ నిర్వహించిన దివాళీ వేడుకల్లో   ఇద్ద‌రు  కలిసి హాజరై సరదాగా డ్యాన్స్ చేసిన వీడియోలు నెట్టింట హల్‌చల్ చేశాయి. అటుపై  బహిరంగ ప్రదేశాల్లో, ఈవెంట్లలో  కలిసి కనిపించడం, సోషల్ మీడియాలో ఒకరి పోస్టులపై మరొకరు స్పందించుకోవడం చూసి అభిమానులు  ప్రేమలో ఉన్నారని భావించారు. కానీ రోహిత్ తాజా ప్ర‌క‌ట‌న‌తో అదంతా ప్ర‌చార‌మ‌ని తేలిపోయింది.

Dating Rumours? Actor Has a Funny Response!