`రాకా`లో దీపిక, రష్మిక, జాన్వీ పాత్రలిలా ఉంటాయ్!
Deepika to Janhvi: What Their Raaka Roles Look Like
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం `రాకా`. ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో లీకైన క్యారెక్టర్ వివరాలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. చిత్రంలో అల్లు అర్జున్ సరికొత్త, భయంకరమైన కోణంలో కనిపించనుండగా, ఆయనతో పాటు నటించే ప్రధాన నాయికల పాత్రల తీరుతెన్నులు ఎలా ఉండబోతున్నాయనే విషయంపై నెట్టింట ఆసక్తికర చర్చ జరుగుతోంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకొణే కీలక పాత్రలో నటిస్తున్నారు. పురాణ కాలానికి చెందిన వైదిక నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె గర్భిణీ స్త్రీగా ప్రాణాల కోసం పోరాడే పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రెగ్నెన్సీని లెక్క చేయకుండా దీపికా సినిమా షూటింగ్‌లో పాల్గొనడం విశేషం. మరో స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ ఈ చిత్రంలో శక్తివంతమైన గిరిజన రాణి (ట్రైబల్ క్వీన్) పాత్రను పోషిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా కథా గమనంలో ఈ పాత్ర ఎంతో కీలకం కానుందని అంచనా వేస్తున్నారు.
మరో నటి రష్మిక మందన్న గైడ్ - ప్రొటెక్టర్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా దీపికా పదుకొణే పాత్రకు అండగా నిలుస్తూ ప్రమాదకర ప్రపంచంలో ఆమెను కాపాడే కీలకమైన పాత్రను రష్మిక పోషిస్తోందిట. పాత్రల లీక్‌లతో `రాకా` పై అంచనాలు మరింత పెరిగిపోతున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాను 2027 డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.







































