ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Hero Nithin Unveils First Look of It's Life Bro

ఇట్స్ లైఫ్ బ్రో ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన హీరో నితిన్‌

Hero Nithin Unveils First Look of It's Life Bro

కేఎం (కృష్ణమోహన్‌), పూజా సుందర్‌ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం 'ఇట్స్ లైఫ్‌ బ్రో'. కేఎం ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సోమశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ మోహన్‌ సల్లగుండ్ల  ఈ చిత్రాన్ని నిర్మిస్తన్నారు.

ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను ప్రామిసింగ్‌  హీరో నితిన్‌ విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ '' వైవిధ్యమైన కథ, కథనాలతో ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంటుంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ భావోద్వేగ ప్రేమకథ అందరికి తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది' అన్నారు.

కృష్ణమోహన్‌, పూజా సుందర్‌ శెట్టి, రాజీవ్‌ కనకాల, చమ్మక్‌ చంద్ర, అంబటి శ్రీనివాస్‌, దేవి ప్రసాద్‌, కిరీటి, త్రిశూల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ఫ్లే: ఇ.రాజయ్య. డీఓపీ:  చైతన్య, సంగీతం: సాహిత్య సాగర్‌, ఎడిటర్‌: సత్య గిద్దుటూరి
 

The first look of the upcoming romantic drama It's Life Bro