ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sanjay Leela Bhansali profound respect for his mother

గుర్తింపులో అమ్మకు అగ్రపీఠం

Sanjay Leela Bhansali profound respect for his mother

 

ప్రముఖ  దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చిత్రాలలో చూపించే దృశ్యకావ్యాల వెనుక ఎంతటి కళాత్మకత ఉంటుందో? ఆయన పేరు వెనుక కూడా అంతే లోతైన భావోద్వేగం ఉంది. సాధారణంగా తండ్రి పేరును ఇంటి పేరుగా వాడుకునే సంప్రదాయానికి భిన్నంగా తన తల్లి పేరు అయిన లీలాను తన గుర్తింపులో భాగంగా మార్చుకున్నారు. తన తల్లి పట్ల ఆయనకున్న అంకితభావానికి గౌరవానికి ఇది నిలువెత్తు నిదర్శనం. ఆమె లేనిదే తాను ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని తన ఉనికికి అసలు అర్థమే లేదని బ‌న్సాలీ పలు సందర్భాల్లో ఎంతో ఉద్వేగంగా చెప్పుకొచ్చారు.

భన్సాలీ తన తల్లిని జన్మనిచ్చిన వ్యక్తిగానే కాకుండా సృజనాత్మకతకు స్ఫూర్తిప్రదాతగా భావిస్తారు. తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు ఆమె చూపే సహనం ,కళల పట్ల ఆమెకున్న మక్కువ భన్సాలీ సినిమాల్లోని మహిళా పాత్రల్లో ప్రతిబింబిస్తుంటాయి. తన తల్లి పేరును తన పేరు మధ్యలో చేర్చుకోవడం ద్వారా ప్రతి విజయంలోనూ ఆమె భాగస్వామ్యం ఉండాలని ఆకాంక్షించారు. మ‌రో రకంగా చెప్పాలంటే ఆయన రూపొందించే ప్రతి వెండితెర అద్భుతం కూడా తన తల్లికి సమర్పించే  గొప్ప నివాళిగా చెప్పొచ్చు.

తల్లి పేరును తన గుర్తింపుగా మార్చుకోవడం ద్వారా భన్సాలీ సమాజానికి ఓ కొత్త సందేశాన్ని ఇచ్చారు. పురుషాధిక్య సమాజంలో తండ్రి పేరుకుండే ప్రాధాన్యతను కాదని మనిషి ఎదుగుదలలో తల్లి పాత్రను ఎవరూ విస్మరించలేరని తన పేరు ద్వారా నిరూపించారు. ఈ నిర్ణయం  వ్యక్తిగత ఇష్టం మాత్రమే కాదని మాతృత్వాన్ని గౌరవించే ప్రతి బిడ్డకూ ఇదొక స్ఫూర్తిదాయకమైన అడుగుగా చెప్పొచ్చు

Sanjay Leela Bhansali adopted his mothers name as a tribute