సాటి తెలుగ‌మ్మాయికి శోభిత సందేశం

Sobhita advice to telugu influencerSobhita advice to telugu influencer


దుబాయ్‌కి చెందిన తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్ శ్రీలత అడెపల్లి ప్రపంచవ్యాప్తంగా ప‌లు రంగాల్లో రాణిస్తున్న తెలుగు మహిళల విజయాలను కొనియాడుతూ చేసిన వీడియో ఇప్పుడు నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో నటి శోభిత ధూళిపాళతో పాటు భావిత మండవ, రాజా కుమారి, దీపిక ముత్యాల వంటి గ్లోబల్ ఐకాన్స్‌ను ప్రస్తావిస్తూ.. తెలుగు మూలాలున్న మహిళల ఆత్మవిశ్వాసాన్ని శ్రీలత ప్రశంసించారు. దీనిపై స్పందించిన శోభిత ధూళిపాళ కేవలం కృతజ్ఞతలతో సరిపెట్టకుండా.. తన వ్యక్తిగత అనుభవాలను జోడిస్తూ రాసిన కామెంట్ నెటిజన్ల మనసు గెలుచుకుంది. తన అంతరాత్మ చెప్పిన దానిని నమ్మినప్పుడే జీవితంలో అత్యంత అర్థవంతమైన క్షణాలు ఎదురయ్యాయని.. మనసు మాట కాదని తీసుకున్న నిర్ణయాలు ఎప్పుడూ విఫలమయ్యాయని శోభిత‌ నిజాయితీగా అంగీక‌రించారు.

శోభిత తన నోట్‌లో జీవితాన్ని నదిపై సాగే ఒక చిన్న ప్రయాణంతో పోల్చుతూ.. ప్రతి ఒక్కరూ తమ సహజత్వాన్ని గౌరవించుకోవాలని హితవు పలికారు. ``గాలిని... నీటి ప్రవాహాన్ని ఆస్వాధిస్తూ సాగాలి`` అంటూ శోభిత‌ వ్యక్తం చేసిన తాత్విక చింతన నెటిజన్లను విప‌రీతంగా ఆకట్టుకుంది. ఒక తెలుగు మహిళ మరో తెలుగు మహిళకు మద్దతు తెలపడం.. ఒకరి ప్రయాణాన్ని మరొకరు గౌరవించుకోవడం ఈ మాట‌ల్లో ప్రధానంగా కనిపించింది. సోషల్ మీడియాల‌లో  పైపై గుసగుస‌ల కంటే వైవిధ్యంగా.. ఇంత లోతైన- స్ఫూర్తిదాయకమైన చర్చ జరగడం అరుదని పలువురు ప్రశంసిస్తున్నారు. ఈ వైరల్ మూమెంట్ సరిహద్దులు దాటి తెలుగు తేజాలు ఒకరికొకరు ఎలా స్ఫూర్తిని నింపుతున్నారో మరోసారి నిరూపించింది.

Sobhita advice to telugu influencer Sree latha