అంకెలు కాదు.. అనుభూతి ముఖ్యం

ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా రితేష్ దేశ్ముఖ్ తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం `రాజా శివాజీ` ఇటీవలే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం రితేష్ 100 కోట్ల బడ్జెట్ కేటాయించారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రచారంపై రితేష్ తాజాగా స్పందించారు. బడ్జెట్ అనేది సినిమా నాణ్యతను బట్టి మారుతుంటుందన్నారు.
అయితే అంకెలను చూసి సినిమాను అంచనా వేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. సినిమా బడ్జెట్ గురించి వస్తోన్న వార్తలను రితేష్ తోసిపుచ్చారు. `మీరు టికెట్ కోసం ఎంత చెల్లిస్తున్నారు? అంటూ ఎదురు ప్రశ్నించారు. ఒక ప్రేక్షకుడు సినిమా చూసేటప్పుడు అది ఎన్ని కోట్లతో నిర్మించారనే దానికంటే? ఆ సినిమా ఇచ్చే అనుభూతికే ప్రాధాన్యత ఇస్తారన్నారు.
బడ్జెట్ ఎంత ఉన్నా? శివాజీ మహారాజ్ వంటి మహానుభావుడి కథను వెండితెరపై నిజాయితీగా ఆవిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని రితేష్ చెప్పుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ కోసం తనతో పాటు టీమ్ ఎంతో కష్టపడ్డామన్నారు. బడ్జెట్ వివరాల కంటే కంటెంట్ పైనే అందరూ దృష్టి పెట్టాలని కోరారు. ఇటీవలే ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.
కానీ అంచనాలు అందుకోవడంలో మాత్రం విఫలమైంది. ఇప్పటి వరకూ ఈ సినిమా 60-70 కోట్ల వసూళ్లను మాత్రమే రాబట్టింది. కానీ బడ్జెట్ లెక్కలు చూస్తే 100 కోట్లకు పైగానే ఖర్చు అయింది. ఈ నేపథ్యంలో మరోసారి నెట్టింట సినిమాఉ అయిన ఖర్చు ఎంత అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయినా? రితేష్ దేశ్ ముఖ్ బడ్జెట్ ఎంత అయిందన్నది మాత్రం క్లారిటీగా చెప్పలేదు.








































