ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Neetu Kapoor disagreements with Alia Bhatt over parenting Raha

అత్తా- కోడ‌లి మ‌ధ్య రాహా పెట్టిన నిప్పు

Neetu Kapoor disagreements with Alia Bhatt over parenting Raha

 

బాలీవుడ్ సీనియర్ నటి నీతూ కపూర్ - కోడలు ఆలియా భట్  మనవరాలు రాహా కపూర్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రాహా పెంపకం విషయంలో ఆలియా అనుసరిస్తున్న కొన్ని కఠినమైన నియమాలు తనకు -ఆలియాకు మధ్య చిన్నపాటి  వివాదాల‌కు  దారితీస్తున్నాయని ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ముఖ్యంగా రాహాకు చక్కెర ఇవ్వడం , టీవీ చూడనివ్వడం వంటి విషయాల్లో ఆలియా చాలా కచ్చితంగా ఉంటుందన్నారు. ఒక బామ్మగా తాను మనవరాలికి చాక్లెట్లు ఇచ్చి గారాబం చేయాలనుకున్నా? ఆలియా ససేమిరా అంటుందని నీతూ కపూర్ తెలిపారు.

ఆలియా భట్ ఒక డిసిప్లినేరియన్అని, రాహా తన తల్లి మాటను తూచా తప్పకుండా వింటుందని నీతూ కపూర్ ప్రశంసించారు. రణబీర్ కపూర్ మాత్రం తన కూతురికి ఒక స్నేహితుడిలా ఉంటాడని ఆమెతో కలిసి అల్లరి చేస్తూ కాలక్షేపం చేస్తాడని వెల్లడించారు. పాత కాలంలో పిల్లలకు టీవీ చూపిస్తూ అన్నం పెట్టేవాళ్లమని కానీ నేటి తరం తల్లిదండ్రులకు ఉన్న అవగాహన తనను ఆశ్చర్యపరుస్తుందని  పేర్కొన్నారు. ఆలియా పెంపకంలో రాహా చాలా పద్ధతిగా పెరుగుతోందని  సంతోషం వ్యక్తం చేశారు.

త‌న భర్త రిషి కపూర్ పెంపకానికి ఇప్పటి తరం పెంపకానికి ఉన్న వ్యత్యాసాన్ని కూడా నీతూ గుర్తు చేసుకున్నారు. రిషి కపూర్ తన పిల్లలతో (రణబీర్, రిద్ధిమ) కొంత దూరం మెయింటైన్ చేసేవారని తండ్రి అంటే భయం ఉండాలని ఆయన భావించేవారన్నారు. కానీ రణబీర్ మాత్రం రాహాకు చాలా దగ్గరగా ఉంటూ ఆమెతో స్నేహం చేస్తున్నాడని ఇది చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. తాను ఒక గ్రేట్ గ్రాండ్‌మదర్ గా ఉంటూ రాహాను అల్లారుముద్దుగా చూసుకోవాలనుకుంటున్నానని ,కానీ ఆలియా నిబంధనలను గౌరవిస్తానని నీతూ కపూర్ ముగించారు.
 

Why Neetu Kapoor disagree Alia Bhatt’s parenting