Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> These Directors In Need of a Hit Very Badly

ఆ న‌లుగురు మ‌ళ్లీ ప‌ట్టాలెక్కేదెప్పుడో

గొప్ప అవ‌కాశం అన్న‌ది ఒక‌సారే వ‌స్తుంది. ఆ ఛాన్స్ ను సద్వినియోగం చేసుకోగ‌లిగితే కెరీర్ కి తిరుగుండ‌దు. ఇంకా మంచి అవకాశాలు వ‌స్తాయి. అదే సద్వినియోగం చేసుకోక‌పోతే స‌న్నివేశం ఇలా ఉంటుంది. ఇంత‌కీ ఎవ‌రా న‌లుగురు  డైరెక్ట‌ర్లు అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. `స్కంద` ఫెయిలైనాన‌ బోయ‌పాటి పై నమ్మ‌కంతో బాలయ్య క‌నీసం క‌థ కూడా విన‌కుండా అఖండ 2కి ఛాన్స్ ఇచ్చారు.

 

అదీ పాన్ ఇండియా సినిమా  చేయ‌మ‌ని బాల‌య్య ఎంతో న‌మ్మ‌కంతో  అవ‌కాశం ఇచ్చారు. కానీ బోయ‌పాటి ఆన‌మ్మ‌కాన్ని నిల‌బెట్ట‌లేక‌పోయారు. అలాగే మారుతికి ప్ర‌భాస్ కూడా అలాంటి గొప్ప అవ‌కాశాన్ని `ది రాజాసాబ్` సినిమాతో క‌ల్పించాడు.  కానీ ఆ చక్క‌ని అవ‌కాశాన్ని మారుతి వినియోగించు కోలేక‌ప‌సోయాడు. న‌మ్మి అవ‌కాశం ఇస్తే  డార్లింగ్ ని నిండా ముంచేసాడు.

 

`జారతిర‌త్నాలు` త‌ర్వాత అనుదీప్ కె.వి వ‌రు స్లాప్ లలల్లో ఉన్నాడు . అయినా యంగ్ హీరో విశ్వ‌క్ సేన్ `ఫంకీ` అనే సినిమా ఛాన్స్ ఇచ్చాడు. కానీ అనుదీప్ ఆ న‌మ్మ‌కాన్ని నిల‌బెట్ట‌లేక‌పోయాడు. డైరెక్ట‌ర్ కిషోర్ తిరుమ‌ల‌కు కూడా అలాంటి అవ‌కాశ‌మే వ‌చ్చింది. మాస్ రాజా ర‌వితేజ హీరోగా కిషోర్ `భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి` అంటూ ఓ సినిమా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

 

ర‌వితేజ‌కు అప్ప‌టికే చేతిలో చాలా సినిమాలున్నాయి. కానీ కిషోర్ మీద న‌మ్మ‌కంతో?  రాజా క‌మిట్ అయ్యాడు. కానీ ఏ లాంభం. అంతా న‌ష్ట‌మే ఎదురైంది. ఇలా న‌లుగురు డైరెక్ట‌ర్లు న‌మ్మి అవ‌కాశం క‌ల్పిస్తే దాన్ని నిల‌బెట్ట‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం ఈ న‌లుగురికి త‌దుప‌రి ఏ హీరోలు డేట్లు ఇస్తారు? అన్న‌ది ఆస‌క్తిక‌రం. మ‌రోవైపు  హీరోలంతా బిజీగా ఉన్నారు. వారి బిజీలో వీరికి డేట్లు ఇవ్వ‌డం అంత సుల‌భం జ‌రిగే ప‌ని కాదు.

Can These Directors get back On Track

These Directors In Need of a Hit Very Badly
director maruthi and boyapati srinu