Advertisement
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> All eyes are on stylish newlyweds Rashmika Mandanna-Vijay

విజయ్-రష్మిక కాపురంపై అందరిలో ఆసక్తి

All eyes are on stylish newlyweds Rashmika Mandanna-Vijay

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ-కన్నడ భామ కాదు కాదు పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న ల వివాహం రాజస్థాన్ ఉదయపూర్ ప్యాలెస్ లో జరగడమే కాదు తెలుగింటి కోడలిగా రష్మిక హైదరాబాద్ లో అడుగుపెట్టింది. ప్రతి సందర్భం అంటే హైదరాబాద్ లో అల్లు శిరీష్ పెళ్ళికొడుకు ఫంక్షన్, విజయ్ దేవరకొండ స్వగ్రామం లో సత్యన్నారాయణ స్వామి వ్రతంలోను, ఫ్యాన్స్ మీట్ లోను, మీడియా లంచ్ ఇలా ప్రతి విషయంలో రష్మిక తెలుగింటి కోడలుగా చీరకట్టి మెడలో మంగళసూత్రం, నుదుటున కుంకుమ తో అందరి మనసులను గెలుచుకుంది.

నిన్న సాయంత్రం సినీ, రాజకీయ ప్రముఖుల నడుమ విజయ్ దేవరకొండ-రష్మీకల వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా ముగిసింది. ఇక రష్మిక, విజయ్ దేవరకొండ ల పెళ్లి వేడుకలు ఎంతో వైభవంగా ముగిసాయి. ఇప్పుడు వారి కాపురం ఎక్కడ పెట్టబోతున్నారనే విషయంలో అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.

అంటే రష్మిక ముంబై, హైదరాబాద్, చెన్నై అంటూ షూటింగ్స్ తో బిజీ. ముఖ్యంగా ముంబై లోనే రష్మిక ఎక్కువ ఉండాలి. విజయ్ దేవరకొండ ఎంతగా పాన్ ఇండియా మూవీస్ చేసినా ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటాడు. సో విజయ్ దేవరకొండ-రష్మికలు హైదరాబాద్ లోనే కాపురం పెడతారనుకుంటున్నారు.

ఏముంది హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ కు సొంతిల్లు ఉంది, అక్కడ ముంబై లోను ఓ ఫ్లాట్ తీసుకుంటే సరిపోతుంది. దీనికి ఇంత ఆలోచన ఎందుకులే అంటూ విజయ్ దేవరకొండ-రష్మిక అభిమానులు చెబుతున్నమాట. 

All Eyes On Vijay and Rashmika Wedding Life

rashmika mandanna and vijay