జూన్ లో లెనిన్
Akhil lenin to release in juneఏప్రిల్ 30 న పెద్ది రాక అఖిల్ లెనిన్ రిలీజ్ కి ఇబ్బందిగా మారింది. మే 1 లెనిన్ విడుదల అంటూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసి అనౌన్స్ చేశాకే సడన్ గా రామ్ చరణ్ పెద్ది ఏప్రిల్ 30 కి వచ్చిపడింది. దానితో లెనిన్ చిత్ర విడుదలపై ఊహాగానాలు మొదలయ్యాయి. లెనిన్ మే 1 నుంచి పోస్ట్ పోన్ అవ్వబోతుంది అనే ప్రచారం స్టార్ట్ అయ్యింది.
అఖిల్, అలాగే లెనిన్ మేకర్స్ లెనిన్ విడుదల తేదీ విషయంలో సైలెంట్ అయ్యారు. దానితో అక్కినేని ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. తాజాగా అఖిల్ అక్కినేని-మురళి కిషోర్ అబ్బూరి కలయికలో మే 1 కి రావాల్సిన లెనిన్ ని జూన్ లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ వైరల్ అవుతోంది.
మరి లెనిన్ పోస్ట్ పోన్ విషయము తేల్చలేదు, కొత్త తేదీ విషయంలోనూ మేకర్స్ మౌనాన్ని ఏమని అర్ధం చేసుకోవాలి అంటూ అభిమానులు మొత్తుకుంటున్నారు. లెనిన్ చిత్రంలో అఖిల్ రగడ్ లుక్ లో కనిపిస్తున్నాడు, ఆయన సరసన భాగ్యశ్రీ బోర్సే విలేజ్ అమ్మాయి లుక్ లో కనిపిస్తుంది.
Akhil Lenin out of Summer Race







































