ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Manchu Manoj to share screen space with Balakrishna

బాలయ్య తో మంచు మనోజ్

Manchu Manoj to share screen space with Balakrishna

 

గతంలో నందమూరి బాలకృష్ణ.. మంచు మనోజ్ చిత్రం ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో ఓ స్పెషల్ రోల్ లో కనిపించారు. ఆ చిత్రం ప్లాప్ చిత్రంగా మిగిలిపోయింది. ఇన్నాళ్లకు మళ్లీ నందమూరి బాలకృష్ణ తో మంచు మనోజ్ కలిసి నటించబోతున్నాడనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

అఖండ 2 తర్వాత బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని తో NBK 111 ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు. ఈ చిత్రానికి మొదటిసారి అనుకున్న కథ బడ్జెట్ పరంగా రిస్క్ తో కూడుకున్నది అవ్వడంతో ఇప్పుడు మరో కథను ఫైనల్ చేసి బాలయ్య తో ఓకే చేయించుకుని ఈ నెల నుంచి షూటింగ్ మొదలు పెట్టేందుకు గోపీచంద్ మలినేని సన్నద్ధం అవుతున్నారు.

ఈచిత్రంలో మంచు మనోజ్ ఓ కీ రోల్ లో కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే MBK 111 టీమ్ మంచు మనోజ్ తో చర్చలు జరిపారనే వార్త వినవస్తుంది. ఈమధ్యన మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ని సక్సెస్ తో స్టార్ట్ చేసాడు. మిరాయ్ ఊపులో పలు ప్రాజెక్ట్స్ ని మంచు మనోజ్ లైన్ లో పెడుతున్న విషయం తెలిసిందే. 

Manchu Manoj guest appearance for Balayya

balakrishna nbk 111