వాల్తేరు వీరయ్య 365 రోజుల పండుగ
Waltair Veerayya is a 365 day festivalఈ ఏడాది సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 12 న విడుదలైన మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య ఎంత హిట్టో తెలిసిన విషయమే. మాస్ లుక్ లో వీరయ్యగా వింటేజ్ చిరుని గుర్తు చెయ్యడంతో మెగా ఫాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే వాల్తేరు వీరయ్య విజయం సాధించి.. కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఓ థియేటర్ లో 2024 జనవరి 12వ తేదీకి 365 రోజులు దిగ్విజయంగా ప్రదర్శిస్తున్నారని.. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని వాల్తేరు వీరయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలు అవనిగడ్డ లో మెగాభిమానులు సమక్షంలో అంగరంగ వైభవంగా జరుగబోతున్నాయని..
వాల్తేర్ వీరయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఈ చిత్ర దర్శకులు బాబీ గారిని, నిర్మాతలు మైత్రి మూవీస్ అధినేతలు నవీన్, రవి గారిని ఆహ్వానించారని.. చిత్ర విజయోత్సవ సంబరాలకు మెగా అభిమానులు అందరూ విచ్చేసి ఈ సంతోషంలో భాగం కావాలని, ఈ వేడుకలని విజయవంతం చేయాలని చిరంజీవి అభిమాన సంఘాలు కోరుచున్నాయి.
Waltair Veerayya news








































