11న తెలంగాణలో ఈశా గ్రామోత్సవం
Gramotsavam Starts at August 11th2004లో సద్గురు ప్రారంభించిన ఈశా గ్రామోత్సవం, గ్రామీణ భారతదేశ స్ఫూర్తిని పునరుజ్జీవింపజేయడానికి ఉద్దేశించినది. మొట్టమొదటి సారి, ఈశా గ్రామోత్సవం తెలంగాణలో ఇంకా ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో దాదాపు 80,000 మందికి పైగా క్రీడాకారులతో నిర్వహించబడుతుంది.
ఆగస్టు 11న మహబూబ్‌నగర్‌లో ఈశా గ్రామోత్సవం ప్రారంభం కానుంది. గౌరవనీయులైన క్రీడా శాఖ మంత్రి శ్రీ వి. శ్రీనివాస గౌడ్ గారు, రాజ్యసభ సభ్యులు శ్రీ జే.సంతోష్ కుమార్ గారు ఇంకా ప్రముఖ నేపధ్య గాయకుడు శ్రీ. రామ్ మిరియాల గారు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే!
వేదిక: DSA మెయిన్ స్టేడియం గ్రౌండ్, DYSO ఆఫీస్, మహబూబ్‌నగర్, తెలంగాణ,తేదీ:11 ఆగస్టు 2023 సమయం: ఉ. 11 గం.లకు పురుషులకు వాలీబాల్, మహిళలకు త్రోబాల్, గ్రామీణ ఆటలు ఇంకా సాంప్రదాయ కళలు గ్రామోత్సవంలో ముఖ్య విభాగాలు.
ఆగస్టు 19,20 తేదీలలో సిద్దిపేటలో, ఆగస్టు 26,27తేదీలలో జనగాం, కరీంనగర్, సంగారెడ్డి, సిరిసిల్ల, వికారాబాద్, వరంగల్, యదాద్రి జిల్లాలలో కూడా ఈ పోటీలు జరగనున్నాయి.
Inauguration of Isha Gramotsavam in Telangana on August 11th







































