హేమలత లవణంగా రేణు దేశాయ్

Renu Desai As Hemalatha Lavanam

రవితేజ హీరోగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు. రాజీ లేని భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం.. టైగర్ నాగేశ్వరరావు1970 స్టువర్ట్‌పురం నేపధ్యంలో పేరు మోసిన దొంగ బయోపిక్ గా రూపొందుతోంది.

ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ రోజు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ చిత్రంలో రేణు దేశాయ్ హేమవతి లవణం అనే చాలా ముఖ్యమైన, పవర్ ఫుల్ పాత్రను పోషిస్తోంది. ఇది నిజ జీవిత పాత్ర. హేమలత లవణం భారతీయ సామాజిక కార్యకర్త, రచయిత, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారు. వీడియోలో రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. రవితేజ సరసన నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 

Renu Desai As Hemalatha Lavanam In Ravi Teja Tiger Nageswara Rao

renu desai
hemalatha lavanam
ravi teja
tiger nageswara rao