GST (గాడ్ సైతాన్ టెక్నాలజీ) ట్రైలర్ లాంచ్
GST Trailer LaunchGST మూవీ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
తోలు బొమ్మల సిత్రాలు బ్యానర్ పై కొమారి జానకి రామ్ దర్శకత్వంలో కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న చిత్రం GST (గాడ్ సైతాన్ టెక్నాలజీ). ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేశారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడుతూ.. ఈ చిత్రం యొక్క టైటిల్ చాలా బాగుంది .డైరెక్టర్ గారు ఈ చిత్రం యొక్క కాన్సెప్ట్ చెప్పాకా,చాలా బాగా అనిపించింది.అలాగే ఈ సినిమా ద్వారా మంచి సందేశం కూడా ఇస్తున్నారు.కాబట్టి ఈ చిత్రం మంచి విజయం సాధించాలని,డైరెక్టర్ కొమారి జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని, చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేశారు.
జూనియర్ సంపు మాట్లాడుతూ.. మాచిత్రం యొక్క ట్రైలర్ ని లాంచ్ చేసినందుకు సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు.అలాగే సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామని డైరెక్టర్ గారిని ఓటీటీలో రిలీజ్ చేయమని చాలా రిక్వెస్ట్ చేశాము. కానీ డైరెక్టర్ గారు ఈ సినిమా క్వాలిటీ గాని, కంటెంట్ గాని, సౌండ్ ఎఫెక్ట్స్ గాని బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. ఇలాయెన్నో, హంగులున్నటువంటి మనసినిమా థియేటర్లో చూస్తేనే ఆ ఫీలింగ్ ఉంటుందని,ఇది థియోటర్స్ లోనే చూడాల్సిన సినిమా అని, థియేటర్లలోనే రిలీజ్ చేస్తానని ఇన్నాళ్లు థియోటర్స్ కోసం వెయిట్ చేశారు.ఖచ్చితంగా అతి త్వరలో ఈ సినిమా థియేటర్ లో రిలీజ్ కాబోతుంది.
స్వాతి మండల్ మాట్లాడుతూ..మా చిత్రం ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి గారు ట్రైలర్ లాంచ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ట్రైలర్ ని చూశాకా మీకు చాలా ఇంట్రెస్ట్ కలిగి చాలా క్యూరాసిటీగా ఉంటారు.ఈ మూవీ లో ఏం చెప్పబోతున్నారని మీకు చాలా ఆత్రుత కలుగుతుంది.గాడ్ సైతాన్ టెక్నాలజీ పోస్టర్ ని చూస్తే.. మీరు హార్రర్ మూవీ అనుకుంటారు. కానీ..ఇందులో లవ్,కామెడీ, రొమాన్స్,హార్రర్, సస్పెన్స్, థ్రిల్లర్ తో పాటు అన్నీ వుంటూ.. ఫస్ట్ టైం కొత్త పాయింట్ తో మా చిత్రం రాబోతుంది. నేను హీరోయిన్ గా చేస్తూ,ఇంపార్టెంట్ పాత్రలో పోషించి,ఈ చిత్రంలో ఒక పార్ట్ అయినందున నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను.ఈ ట్రైలర్ చూశాక మీకు ఖచ్చితంగా నచ్చి, చాలా ఎగ్జైట్ ఫీలై ఈ మూవీని థియోటర్స్ లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈచిత్రంలో నాకు హీరోయిన్ గా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని మాట్లాడారు.
అశోక్ మాట్లాడుతూ.. మా చిత్రం GST (గాడ్ సైతాన్ టెక్నాలజీ) చిత్రం యొక్క ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చేతుల మీదుగా లాంచ్ చేయడం జరిగింది.మా మూవీ జిఎస్టి జి అంటే గాడ్ అంటే దేవుళ్లకు సంబంధించి గానీ సైతాన్ దయ్యాల కు సంబంధించి గానీ,టెక్నాలజీ అంటే సైన్స్ లో ఒక కొత్త పాయింట్ ని తీసుకొని ఈ మూడింటిని కంపారిజన్ చేస్తూ.. సృష్టిలో ఏది నిజం? దేవుడా, దయ్యమా, సైన్స్ వీటన్నిటిలో ఏది నిజం అని చెప్పాలని మా దర్శకులు శ్రీ కొమారి జానకిరామ్ గారు తనకున్న ఎక్స్పీరియన్స్ తో దాదాపు ఇండస్ట్రీలో మంచి దర్శకుల దగ్గర వర్క్ చేసి,ఎన్నో సంవత్సరాల అనుభవంతో ఒక కొత్త పాయింట్ ని తీసుకొని, ఒక మంచి ఎగ్జైట్మెంట్ ఎలిమెంట్స్ తో సినిమాని మన ముందుకు తీసుకురాబోతున్నారు. మనందరికీ కూడా చిన్నప్పటి నుంచి చాలామందికి చాలా చాలా అపోహలున్నాయి.అసలు దేవుడు దెయ్యం సైన్స్ ఈ మూడింటిలో ఏది నిజం? ఎవరు గొప్ప అనేది? నేను 100% ప్రామిస్ చేసి చెబుతున్నాను దానికి సమాధానం కావాలంటే మా మాత్ర GST సినిమాని చూడండి.100% యూ విల్ గెట్ ద క్లారిఫికేషన్ .మా మూవీ చాలా బాగుంది. ట్రైలర్ కూడా మీ అందరికీ నచ్చుతుంది. కామెడీ, రొమాన్స్, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఒక మంచి సోషల్ మెసేజ్ తో మీ ముందుకు రాబోతున్నాం అని చెప్పారు.
దర్శకుడు జానకిరామ్ మాట్లాడుతూ.. మా తోలు బొమ్మల సిత్రాలు బ్యానర్ పై నిర్మించినటువంటి గాడ్ సైతాన్ టెక్నాలజీ చిత్రం ట్రైలర్ ని సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లాంచ్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.ముఖ్యంగా.. మంత్రిగారు టైటిల్ గురించి,మా చిత్రం గురించి,ఈ చిత్రం లో ఏ సందేశం ఇస్తున్నారని అడిగారు. మా సినిమా ద్వారా ఏం చెప్పబోతున్నామో, ఏం సందేశం ఇస్తున్నామో చెప్పిన తర్వాత అది విని, మంత్రిగారు ఎగ్జైట్గా ఫీలై చాలా మంచి కంటెంట్ చెప్పబోతున్నారని అభినందించి నందుకు మంత్రి గారికి మా చిత్ర యూనిట్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక కంటెంట్ విషయానికి వస్తే అసలు ఈ సమాజంలో దేవుడు, దయ్యము,సైన్స్ పైన చాలా అనుమానాలు, అపోహలున్నాయి. వాటిని నిగ్గు తేల్చడానికేమేం దమ్మున్న కథతో మీ ముందుకు వస్తున్నాము అని చెప్పారు.
GST Trailer Launch







































