రానా 'విరాటపర్వం'లో నివేదా పేతురాజ్
Nivetha Pethuraj In A Crucial Role In Rana's Virataparvamరానా, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం విరాటపర్వం. నీదీ నాదీ ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని డి. సురేష్‌బాబు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశలో ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చివరి షెడ్యూల్ జరుగుతోంది. ఇప్పటికే పలువురు పేరుపొందిన తారలు నటిస్తోన్న ఈ చిత్రంలో తాజాగా నివేదా పేతురాజ్ జాయిన్ అయ్యారు. ఆమె ఇందులో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. లాస్ట్ షెడ్యూల్ షూటింగ్‌లో ఆమె పాల్గొంటున్నారు.
ఒక యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇప్పటివరకూ కనిపించని పాత్రల్లో రానా, సాయిపల్లవి నటిస్తున్నారు. మిగతా ముఖ్య పాత్రల్లో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్ కనిపించనున్నారు.
తారాగణం:
రానా దగ్గుబాటి, సాయిపల్లవి, ప్రియమణి, నందితా దాస్, నివేదా పేతురాజ్, నవీన్ చంద్ర, జరీనా వహాబ్, ఈశ్వరీ రావ్, సాయిచంద్, బెనర్జీ, నాగినీడు, రాహుల్ రామకృష్ణ, దేవీప్రసాద్, ఆనంద్ రవి, ఆనంద్ చక్రపాణి
The film already has ensemble cast and Nivetha Pethuraj is zeroed in for a crucial role







































