ర‌వితేజ క్రాక్ టాకీ పార్ట్ పూర్తి!

Ravi Teja Crack Talkie Part Completed

ర‌వితేజ‌, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ ఫిల్మ్ క్రాక్ టాకీ పార్ట్ పూర్తి.

మాస్ మహారాజా ర‌వితేజ‌, బ్లాక్‌బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న మూడో చిత్రం క్రాక్  షూటింగ్ ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్త‌యింది. త్వ‌ర‌లో హీరో హీరోయిన్లు ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌పై ఓ పాట‌ను చిత్రీక‌రించ‌నున్నారు. ఆ పాట‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌యిన‌ట్లే. తెలుగు రాష్ట్రాల్లో జ‌రిగిన కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందుతోన్న క్రాక్ లో హీరోయిన్‌గా శ్రుతి హాస‌న్ క‌థ‌కు కీల‌క‌మైన ఓ పాత్ర‌ను పోషిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంటెన్స్ స్టోరీతో పాటు అన్ని వ‌ర్గాల వారినీ ఆక‌ట్టుకొనే అంశాలు ఉన్నాయి. పేరుపొందిన త‌మిళ న‌టులు స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ప‌వ‌ర్‌ఫుల్ క్యారెక్ట‌ర్లు పోషిస్తున్నారు. స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్ బ్యాన‌ర్‌పై బి. మ‌ధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్‌. త‌మ‌న్ సంగీతం స‌మ‌కూరుస్తున్నారు. మెర్సాల్, బిగిల్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాల‌కు ప‌నిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. వ‌చ్చే సంక్రాంతికి థియేట‌ర్ల‌లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.

తారాగ‌ణం: ర‌వితేజ‌, శ్రుతి హాస‌న్‌, స‌ముద్ర‌క‌ని, వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, దేవీ ప్ర‌సాద్‌, చిర‌గ్ జాని, మౌర్య‌ని, సుధాక‌ర్ కొమాకుల‌, వంశీ చాగంటి.

సాంకేతిక బృందం: బ్యాన‌ర్‌: స‌ర‌స్వ‌తి ఫిలిమ్స్ డివిజ‌న్‌, సంగీతం: ఎస్‌. త‌మ‌న్‌, సినిమాటోగ్ర‌ఫీ:  జి.కె. విష్ణు, డైలాగ్స్‌:  సాయిమాధ‌వ్  బుర్రా, పీఆర్వో:  వంశీ-శేఖ‌ర్, స‌హ నిర్మాత‌: అమ్మిరాజు కానుమిల్లి, కూర్పు: న‌వీన్ నూలి, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాష్‌, ఫైట్స్‌:  రామ్‌-ల‌క్ష్మ‌ణ్‌, పాట‌లు:  రామ‌జోగ‌య్య శాస్త్రి, నిర్మాత‌:  బి. మ‌ధు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం:  గోపీచంద్ మ‌లినేని.

Ravi Teja Crack Talkie Part Completed

crack movie
ravi teja
gopichand malineni