అక్కినేని హీరో కొత్త సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్..
Interesting Title for Akkineni Heroఇండస్ట్రీలో వారసులు ఎంతో మంది ఉన్నారు. అయితే వారసులుగా వచ్చిన వారందరికీ సక్సెస్ లు రాలేదు. సక్సెస్ లు లేక సినిమాలు మానేసిన వాళ్ళు కొందరుంటే, ఏడాదికో, రెండేళ్ళకో సినిమా చేసే వాళ్ళు కొందరున్నారు. అలాంటి కోవలోకి చెందిన వాడే అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుశాంత్. సుశాంత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి చాలా సంవత్సరాలయింది. అతడు హీరోగా ఎన్నో సినిమాలు చేశాడు.
కానీ ఏదీ కూడా అతనికి గుర్తింపు తీసుకురాలేదు. మొన్నటికి మొన్న చిలసౌ సినిమాతో విజయం అందుకున్నాడు. చిలసౌ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. రాహుల్ రవీంద్ర అనే నటుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. చిలసౌ సినిమా బాగున్నప్పటికీ నటుడిగా సుశాంత్ కి పేరు తీసుకురాలేదు. హీరోగా విజయాలు లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ట్రై చేద్దామని అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంలో నటించాడు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించినప్పటికీ సుశాంత్ కి పేరు రాలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అవుదామని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. అయితే ప్రస్తుతం హీరో సుశాంత్ నుండి మరో కొత్త సినిమా రాబోతుంది. "ఇచ్చట వాహనములు నిలుపరాదు" అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. దర్శక నిర్మాతలతో పాటు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో నేడు పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభిస్తున్నారు.
మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారు. దర్శకుడు దర్శన్ ఎస్ ఈ చిత్రాన్ని ఓ నూతన కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఏ ఐ స్టూడియోస్, సహస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నారు.
hero Sushanth doing a film as solo hero. the title of the this film is very interesting







































